IFS Results | ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ (IFS) ఫలితాల్లో తెలుగు అభ్యర్థులు సత్తాచాటారు. 2022 సంవత్సారానికి గానూ నిర్వహించిన ఐఎఫ్ఎస్ ఫలితాలను యూపీఎస్సీ శనివారం విడుదల చేసింది. ఈ ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్లోని బాపట్లకు చెందిన కొల్లూరు వెంకట శ్రీకాంత్ ఆలిండియా టాపర్గా నిలిచాడు. హైదరాబాద్కు చెందిన పన్నాల సాహితీరెడ్డి 48వ ర్యాంకు, తొగరు సూర్యతేజ 66వ ర్యాంక్ సాధించారు.
కాగా గత ఏడాది నవంబర్ 20 నుంచి 27 వరకు ఐఎఫ్ఎస్ రాత పరీక్ష నిర్వహించగా, ఈ ఏడాది జూన్లో ఇంటర్వ్యూలను పూర్తి చేసిన యూపీఎస్సీ ఇవాళ తుది ఫలితాలను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 147 మంది అభ్యర్థులను ఎంపిక చేసింది. మరో 12 మందిని తాత్కాలికంగా ఎంపిక చేసింది.