Rs.2000 Notes: మీవద్ద 2వేల నోట్లు ఇంకా ఉన్నాయా? వాటిని ఇలా డిపాజిట్ చేయండి
Rs.2,000 Notes: మీ దగ్గర ఇంకా రెండు వేల నోట్లు ఉన్నాయా. వాటిని మార్చుకునేందుకు ఆర్బీఐ రెండు ఆప్షన్లు ఇచ్చింది. ఇన్సూర్డ్ పోస్టు లేదా టీఎల్ఆర్ చేయాలని సూచించింది. ఈ రెండు పద్ధతుల్లో ఆ నోట్లను మార్చుకునే అవకాశం కల్పించారు.
న్యూఢిల్లీ: మీ దగ్గర ఇంకా రూ.2000 నోట్లు(Rs.2000 Notes) ఉన్నాయా? వాటిని ఇంకా ఎక్స్చేంజ్ చేసుకోలేదా? రూ.2వేల నోట్లను మార్చుకునేందుకు ఆర్బీఐ రెండు పద్ధతుల్లో అవకాశం కల్పించింది. ఒకవేళ మీ దగ్గర 2వేల నోట్లు ఉంటే, పోస్టు ద్వారా ఆ నోట్లను ఆర్బీఐకి పంపుకునే అవకాశాన్ని కల్పించారు. ఇన్సూర్డ్ పోస్టు ద్వారా ఆ అమౌంట్‌ను పంపుకోవచ్చు. బ్యాంక్ అకౌంట్లోకి ఆ 2వేల నోట్ల అమౌంట్ క్రెడిట్ అవుతుందని ఆర్బీఐ అధికారులు చెప్పారు. ప్రాంతీయ ఆఫీసులకు దూరంగా ఉన్న ప్రజలకు ఈ అవకాశం కల్పిస్తున్నట్లు ఆర్బీఐ తెలిపింది. ఇన్స్యూర్డ్ పోస్టుతో పాటు టీఎల్ఆర్ పద్ధతిలోనూ రెండు వేల నోట్లను ఎక్స్చేంజ్ చేసుకునే అవకాశాన్ని కల్పించారు. టీఎల్ఆర్ అంటే ట్రిపుల్ లాక్ రిసెప్టకల్. టీఎల్ఆర్ దరఖాస్తును నింపి ఆర్బీఐకి పంపిస్తే, అప్పుడు ఆ కస్టమర్ బ్యాంక్ అకౌంట్లోకి అమౌంట్ డిపాజిట్ అవుతుంది.
2వేల నోట్లను ఇన్సూర్డ్ పోస్టు ద్వారా పంపిస్తే చాలా భద్రంగా ఆ అమౌంట్ చేరుకుంటుందని, ఆ కస్టమర్లు బ్యాంకు కోసం ప్రయాణాలు చేయాల్సిన అవసరం కూడా ఉండదని ఆర్బీఐ రీజినల్ డైరెక్టర్ రోహిత్ పీ దాస్ తెలిపారు. టీఎల్ఆర్, ఇన్సూర్డ్ పోస్టు విధానాలు చాలా భద్రమైనవని అధికారులు తెలిపారు. ఢిల్లీలోని ఆర్బీఐ ఆఫీసుకు ఇప్పటి వరకు 700 టీఎల్ఆర్ ఫార్మ్స్ వచ్చినట్లు చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

