Brij Bhushan: ఆరోపణలు నిరూపిస్తే.. ఉరేసుకుంటా: బ్రిజ్ భూషణ్
Brij Bhushan: తనపై వచ్చిన ఆరోపణలను నిరూపిస్తే, తాను ఆత్మహత్య చేసుకోనున్నట్లు బ్రిజ్ భూషణ్ తెలిపారు. రెజ్లర్లు తమ వద్ద ఏవైనా ఆధారాలు ఉంటే కోర్టుకు సమర్పించుకోవచ్చు అని ఆయన అన్నారు. అయితే బ్రిజ్‌పై నమోదు అయిన కేసులో ఇంకా విచారణ జరుగుతున్నట్లు మరో వైపు ఢిల్లీ పోలీసులు తెలిపారు.
న్యూఢిల్లీ: లైంగిక వేధింపులకు పాల్పడిన భారత రెజ్లింగ్ సమాఖ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్(Brij Bhushan)ను అరెస్టు చేయాలని గత కొన్నాళ్ల నుంచి మహిళా రెజ్లర్లు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. అయితే తనపై వచ్చిన ఆరోపణలను తాజాగా మరోసారి కొట్టిపారేశారాయన. తనపై వచ్చిన ఆరోపణల్లో.. ఒక్కదాన్ని నిరూపించినా.. తాను ఉరివేసుకోనున్నట్లు బ్రిజ్ భూషణ్ తెలిపారు. మీ దగ్గర ఏవైనా ఆధారాలు ఉంటే, వాటిని కోర్టుకు సమర్పించాలని, శిక్షను అనుభవించడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆయన వెల్లడించారు.
బ్రిజ్‌ను అరెస్టు చేయాలని కోరుతూ కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవాన్ని రెజ్లర్లు అడ్డుకునే ప్రయత్నం చేసిన విషయం తెలిసిందే. ఇక మంగళవారం రోజున తమ పతకాలను గంగా నదిలో కలిపేందుకు కూడా వాళ్లు వెనుకాడలేదు. అయితే చివరి నిమిషంలో ఆ ప్రయత్నాన్ని వాళ్లు విరమించారు. రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడిపై ఢిల్లీ పోలీసులు కూడా ఓ కొత్త విషయాన్ని తెలిపారు.
బ్రిజ్‌పై వస్తున్న ఆరోపణలకు చెందిన ఆధారాలు లేవని పోలీసు వర్గాలు వెల్లడించాయి. రాజకీయవేత్తను అరెస్టు కోసం వారెంట్ జారీ చేయాలన్నా.. సరైన ఆధారాలు లేవని పోలీసులు చెబుతున్నారు. మరో 15 రోజుల్లోగా దర్యాప్తునకు చెందిన రిపోర్టును కోర్టుకు సమర్పించనున్నామని తెలిపారు. ఛార్జ్‌షీట్ లేదా ఫైనల్ రిపోర్టు తరహాలో ఆ నివేదికను కోర్టుకు ఇవ్వనున్నట్లు ఓ అధికారి చెప్పారు. ఈ కేసును ఇంకా విచారిస్తున్నామని పోలీసులు తమ ట్విట్టర్లో వెల్లడించారు.
ఒలింపిక్ మెడల్ గ్రహీతలు సాక్షీ మాలిక్, భజరంగ్ పూనియాతో పాటు ఆసియా గోల్డ్‌మెడల్ గ్రహీతలు వినేశ్ పోగట్.. జనవరి నుంచి బ్రిజ్‌కు వ్యతిరేకంగా ఆందోళన చేపడుతున్న విషయం తెలిసిందే. ఎంతో మంది మహిళా అథ్లెట్లను బ్రిజ్ లైంగికంగా వేధించినట్లు ఆ సీనియర్ రెజ్లర్లు ఆరోపిస్తున్నారు. మంగళవారం హరిద్వార్‌లో తమ పతకాలను గంగలో వేద్దామనుకున్నా.. రైతు నేత నరేశ్ టికాయత్ అడ్డుకోవడంతో ఆ కార్యక్రమాన్ని విరమించారు. రేపు యూపీలోని ముజాఫర్‌నగర్ జిల్లాలోని సౌరమ్ గ్రామంలో టికాయత్ నేతృత్వంలో జరగనున్న కాప్ పంచాయతీ సమావేశాల్లో కీలక నిర్ణయం తీసుకోనున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Brij Bhushan
- hang
- WFI Chief
RELATED ARTICLES
తాజా వార్తలు
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

