Cancer | కేక్‌లలో క్యాన్సర్ కారకాలు.. ప్రజలను అప్రమత్తం చేసిన ప్రభుత్వం
బెంగళూరులో 12 కేక్ శాంపిళ్లలో క్యాన్సర్ కారకాలను గుర్తించినట్టు కర్ణాటక ఆహార భద్రత, నాణ్యత విభాగం ప్రకటించింది. మొత్తం 235 శాంపిళ్లను సేకరించగా అందులో 12 కేక్‌లలో కృత్రిమ రంగులు ఎక్కువగా ఉన్నట్టు గుర్తించామని తెలిపింది.
- బెంగళూరులో 12 శాంపిళ్లలో గుర్తింపు
Cancer | బెంగళూరు, అక్టోబర్ 3: బెంగళూరులో 12 కేక్ శాంపిళ్లలో క్యాన్సర్ కారకాలను గుర్తించినట్టు కర్ణాటక ఆహార భద్రత, నాణ్యత విభాగం ప్రకటించింది. మొత్తం 235 శాంపిళ్లను సేకరించగా అందులో 12 కేక్‌లలో కృత్రిమ రంగులు ఎక్కువగా ఉన్నట్టు గుర్తించామని తెలిపింది. ప్రజాదరణ పొందిన రెడ్ వెల్వెట్, బ్లాక్ ఫారెస్ట్ లాంటి కేక్‌లలో తరచూ ఈ కృత్రిమ రంగులను కలుపుతున్నారని.. వీటి వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని ప్రజలను హెచ్చరించింది. ఈ నేపథ్యంలో అల్లూరా రెడ్, సన్ఫెస్ట్ యెల్లో ఏసీఎఫ్, పొన్సియూ 4ఆర్, టార్టాజైన్, కెర్మోసైన్ తదితర కృత్రిమ రంగుల వాడకంలో భద్రత ప్రమాణాలను పాటించాలని బేకరీలను ప్రభుత్వం ఆదేశించింది. కృత్రిమ రంగుల వాడకం క్యాన్సర్ కారకంగా పని చేయడమే కాకుండా శారీరక, మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉన్నదని కర్ణాటక ఆహార భద్రత, నాణ్యత విభాగం తెలిపింది.
మద్యపానంతో ఆరు రకాల క్యాన్సర్లు
మద్యం సేవించటం వల్ల ఆరు రకాల క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఉన్నదని శాస్త్రవేత్తలు గుర్తించారు. హెడ్ అండ్ నెక్ క్యాన్సర్, అన్నవాహిక క్యాన్సర్, కాలేయ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, పేగు క్యాన్సర్, ఉదర క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయని అమెరికన్ అసోసియేషన్ ఫర్ క్యాన్సర్ రిసెర్చ్ పరిశోధకులు వెల్లడించారు. మద్యపానం వల్ల మన డీఎన్ఏ కూడా దెబ్బతినే చాన్స్ ఉన్నదని తెలిపారు. 2019 డాటా ప్రకారం ప్రతి 20 మందిలో ఒకరు మద్యం సేవించటం వల్ల క్యాన్సర్ బారిన పడ్డవారేనని వివరించారు. క్యాన్సర్ పెరగటానికి అనేక కారణాలు దోహదం చేస్తాయని స్పష్టంచేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karnataka HC | ప్రతి విషయాన్ని విచారించే అధికారం ఆ సంస్థకు లేదు.. కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు..!
girl consumes cough syrup dies | జ్యూస్‌గా భావించి దగ్గు మందు అంతా తాగిన బాలిక.. నిద్రలోకి జారుకుని మృతి
Yogita Rana | విద్యతో ఖైదీల్లో మార్పునకు చర్యలు : విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితారాణా
VC Aldas Janaiah | వీసీ అల్డాస్ జానయ్యపై చర్యలకు ప్రొఫెసర్లు, విద్యార్థుల డిమాండ్.. వీడియో
Kolkata’s Presidency University | వివేకానంద పోస్టర్‌కు అవమానం.. ఇద్దరు విద్యార్థినులను బహిష్కరించిన యూనివర్సిటీ
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?

