కోవిడ్ చికిత్స నుంచి ఐవర్‌మెక్టీన్, హైడ్రోక్సీక్లోరోక్విన్ ఔట్

న్యూఢిల్లీ: కోవిడ్ చికిత్స కోసం ఐవర్‌మెక్టీన్, హైడ్రాక్సీక్లోరోక్విన్ ఔషధాలను వినియోగిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆ ఔషధాలను కోవిడ్ చికిత్స కోసం వాడరాదు అని ఐసీఎంఆర్ నేతృత్వంలోని నేషనల్ టాస్క్ ఫోర్స్ ఇవాళ కొత్తగా ఆదేశాలు జారీ చేసింది. వయోజన కోవిడ్19 రోగులకు చికిత్స సమయంలో ఆ రెండు ఔషధాలను వినియోగించరాదు అని ఐసీఎంఆర్ టాస్క్ ఫోర్స్ చెప్పింది. కోవిడ్19 చికిత్స కోసం తాజాగా రిలీజ్ చేసిన మార్గదర్శకాల్లో ఐసీఎంఆర్ ఈ విషయాన్ని తెలిపింది. కరోనా వైరస్ పట్ల ఆ ఔషధాలు ప్రభావంతంగా పనిచేసినట్లు తేలలేదని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. అయినా ట్రయల్ పద్ధతిలో ఆ రెండు మందులను వాడేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. యాంటీపారసైటిక్ మెడిసిన్ ఐవర్‌మెక్టీన్ వాడడం వల్ల.. కోవిడ్ రోగుల్లో వైరల్ లోడ్ కానీ, లక్షణాలు కానీ తగ్గలేదని ఎయిమ్స్ అధ్యయనంలో తేలింది. అధిక డోసుల్లో ఐవర్‌మెక్టీన్ ఇచ్చినా ఫలితం కనబడలేదు. ఇక హైడ్రాక్సీక్లోరోక్విన్ వల్ల కూడా మరణాల సంఖ్య తగ్గలేదని ఓ నివేదిక తేల్చింది. అంతేకాదు, అజిత్రోమైసిన్‌తో కలిపి ఆ మందును వాడితే దాంతో సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నట్లు గుర్తించారు. ఇష్టానుసారంగా ఐవర్‌మెక్టీన్ ఔషధాన్ని వాడకూడదని ప్రపంచ ఆరోగ్య సంస్థ వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YS Sharmila | బెంగళూరులోని యలహంక ప్యాలెస్ నా బిడ్డల హక్కు : వైఎస్ షర్మిల
Drinking Water | రాష్ట్రంలో మొదలైన తాగునీటి కష్టాలు.. ఈ దృశ్యాలు చూశారా..?
Jailer 2 | రజనీకాంత్ ‘జైలర్ 2’ అరుదైన రికార్డు.. రూ.800 కోట్ల దిశగా పరుగులు, నాలుగు రాష్ట్రాల్లో సరికొత్త చరిత్ర!
YS Sharmila | యలహంక ఇంట్లో నా కుమార్తె పెళ్లి జరగట్లేదు.. వేరే చోట నిర్వహిస్తున్నాం: వైఎస్ షర్మిల
Vettuvam | పా. రంజిత్ ‘వేట్టువం’ రిలీజ్ డేట్ ఫిక్స్.. సంక్రాంతి 2027 బరిలో భారీ యాక్షన్ ఎపిక్!
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

