న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా కరోనా కొత్త ఉత్పరివర్తనం ఒమిక్రాన్ ముప్పు పెరుగుతున్నది. ఈ క్రమంలో ప్రస్తుతం ఉన్న వ్యాక్సిన్లు కొత్త వేరియంట్‌కు వ్యతిరేకంగా పని చేస్తాయా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కొత్త వేరియంట్‌పై కొవాగ్జిన్ టీకా ప్రభావంతంగా ఉంటుందని భారత్ బయోటెక్‌తో కలిసి టీకా తయారు చేసిన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) నిపుణులు పేర్కొన్నారు. ఐసీఎంఆర్‌కు చెందిన ఓ అధికారి మాట్లాడుతూ.. కొవాగ్జిన్ టీకా ప్రస్తుతం ఉన్న మిగతా వ్యాక్సిన్ల కంటే మరింత ప్రభావంతంగా ఉంటుందన్నారు.
ఎందుకంటే.. ఇన్‌యాక్టివేటెడ్ వైరస్ సాంకేతికతపై వ్యాక్సిన్ తయారైందని, ఇది కొత్త వేరియంట్‌పై కూడా ప్రభావంతంగా ఉంటుందన్నారు. టీకా ఇంతకు ముందు వచ్చిన ఆల్ఫా, బీటా, గామా, డెల్టా వేరియంట్లపై సైతం సమర్థవంతంగా పని చేసినట్లు గుర్తు చేశారు. అయితే, వ్యాక్సిన్ తీసుకున్న వారంతా జాగ్రత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. వేరియంట్‌కు వ్యతిరేకంగా టీకా ప్రభావాన్ని తెలుసుకునేందుకు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ కలిసి పరీక్షలు నిర్వహించనున్నట్లు చెప్పారు.