Rahul Gandhi | ‘కుక్క బిస్కెట్’పై బీజేపీకి అంత వ్యామోహం ఎందుకు..?: రాహుల్‌గాంధీ
Rahul Gandhi | ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’లో భాగంగా జార్ఖండ్‌లో పర్యటించిన రాహుల్‌గాంధీ.. అక్కడ ఓ కుక్కకు బిస్కెట్ తినిపించే ప్రయత్నం చేయడం వివాదాస్పదమైంది. రాహుల్‌గాంధీ కుక్కకు బిస్కెట్ తినిపించబోగా అది తినకపోవడంతో పక్కనే ఉన్న వ్యక్తి చేతిలో ఆ బిస్కెట్లు పెట్టాడు. దాంతో పార్టీ కార్యకర్తకు కుక్క బిస్కెట్లు ఇచ్చి రాహుల్‌గాంధీ అవమానించారని బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది.
Rahul Gandhi: ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’లో భాగంగా జార్ఖండ్‌లో పర్యటించిన రాహుల్‌గాంధీ.. అక్కడ ఓ కుక్కకు బిస్కెట్ తినిపించే ప్రయత్నం చేయడం వివాదాస్పదమైంది. రాహుల్‌గాంధీ కుక్కకు బిస్కెట్ తినిపించబోగా అది తినకపోవడంతో పక్కనే ఉన్న వ్యక్తి చేతిలో ఆ బిస్కెట్లు పెట్టాడు. దాంతో పార్టీ కార్యకర్తకు కుక్క బిస్కెట్లు ఇచ్చి రాహుల్‌గాంధీ అవమానించారని బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది.
పార్టీ కార్యకర్తలపై రాహుల్‌గాంధీకి అంత చిన్నచూపు దేనికని విమర్శలు చేస్తోంది. అసోం సీఎం హిమాంత బిశ్వశర్మ సహా పలువురు బీజేపీ నేతలు రాహుల్ తీరును తప్పుబట్టారు. అయితే బీజేపీ విమర్శలపై రాహుల్‌గాంధీ స్పందించారు. కుక్కకు తినిపించబోయిన బిస్కెట్‌ను పక్కన ఉన్న వ్యక్తికి ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందో వివరించారు.
‘యాత్రలో భాగంగా తాను జార్ఖండ్‌కు వెళ్లినప్పుడు ఓ వ్యక్తి తన కుక్కతో తారపడ్డాడు. ఆ సందర్భంగా తాను ఆ కుక్కకు బిస్కెట్ తినిపించే ప్రయత్నం చేశాను. కానీ జనాన్ని చూసి అప్పటికే భయంతో వణికిపోతున్న కుక్క తాను ఇచ్చిన బిస్కెట్ తినలేదు. దాంతో ఆ బిస్కెట్లను దాని యజమానికి ఇచ్చాను. అతని చేత్తో ఇవ్వగానే కుక్క ఆ బిస్కెట్లను తిన్నది. ఇందులో బీజేపీకి వచ్చిన ఇబ్బంది ఏందో నాకు అర్థం కావడంలేదు’ అని రాహుల్‌గాంధీ అన్నారు.
కానీ బీజేపీ మాత్రం మీరు ఓ వీధి కుక్కకు బిస్కెట్ తినిపంచే ప్రయత్నం చేశారని, అది తినకపోవడంతో పక్కనే ఉన్న కాంగ్రెస్ కార్యకర్తకు ఆ బిస్కెట్లు ఇచ్చారని ఆరోపిస్తోందిగా..? అని మీడియా ప్రశ్నించగా.. అది అబద్ధమని కొట్టిపారేశారు. తన నుంచి బిస్కెట్ల తీసుకున్న వ్యక్తి కాంగ్రెస్ కార్యకర్త కానే కాదని చెప్పారు. అయినా ఈ ఘటనపై బీజేపీకి అంత వ్యామోహం దేనికో తనకు అర్థం కావడంలేదని అన్నారు.
ఇదిలావుంటే రాహుల్‌గాంధీ నుంచి బిస్కెట్ తీసుకున్న ప్రితేశ్ షా అనే వ్యక్తి కూడా ఆయన ఆ బిస్కెట్ ఇచ్చింది తన కోసం కాదని, తన కుక్క కోసమని ప్రకటించాడు. ఆ ఘటనకు సంబంధించిన రియల్ వీడియో అంటూ ఒక వీడియోను పోస్ట్ చేశాడు. కాగా, రాహుల్‌గాంధీతో మాట్లాడుతూ ఆయన నుంచి కుడిచేతితో బిస్కెట్‌ను తీసుకున్న ప్రితేశ్ షా.. ఎడమ చేతితో దాన్ని కుక్కకు తినిపించినట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నది. కింది వీడియోలో ఆ దృశ్యాన్ని మీరు కూడా చూడవచ్చు.
Exclusive: Dog’s owner is himself clearing the air. The biscuit was given for the dog. pic.twitter.com/CKpkp4oylX
— Pritesh Shah (@priteshshah_) February 6, 2024
Here is the real video pic.twitter.com/ric6D3TSHq
— Pritesh Shah (@priteshshah_) February 6, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
విద్యుత్ ఉపకేంద్రం నిర్మాణానికి ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు భూమి పూజ
Donation | కొమురం భీమ్ విగ్రహావిష్కరణకు బీఆర్ఎస్ నాయకుడు విరాళం
IT Park | చౌటుప్పల్ ఐటీ పార్కులో భారీ పేలుడు.. వ్యక్తి మృతి
పీఆర్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడిగా రాపోలు పరమేశ్
‘కుమ్మరులకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి రూ.300 కోట్ల బడ్జెట్ కేటాయించాలి’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

