Watch: బహిరంగంగా క్షమాపణలు చెప్పిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ.. ఎందుకంటే?
త్వరలో మంచి రోడ్డు అందుబాటులోకి వస్తుంది. మీరు ఇప్పటి వరకు ఎదుర్కొన్న ఇబ్బందులకు నేను క్షమాపణలు కోరుతున్నాను అని అన్నారు.
భోపాల్: జాతీయ రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. మధ్యప్రదేశ్లో ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఆ రాష్ట్ర హైవేపై ఒక చోట అధ్వాన్నంగా నిర్మించిన రోడ్డుపై సారీ చెప్పారు. ఆ ప్రాజెక్టును కొత్త కాంట్రార్టర్కు అప్పగించినట్లు వెల్లడించారు. జబల్పూర్లోని మండలలో సోమవారం జరిగిన కార్యక్రమంలో రూ.1,261 కోట్ల విలువైన ఐదు జాతీయ రహదారుల ప్రాజెక్టులను ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. ‘నాకు బాధగా ఉంది. నేను చాలా విచారం వ్యక్తం చేస్తున్నా. పొరపాటు జరిగితే క్షమాపణ చెప్పడానికి నేను వెనుకాడను. మండల- జబల్పూర్ హైవేలో 63 కిలోమీటర్ల మేర బరేలా నుంచి మండలానికి రూ.400 కోట్లతో రహదారిని నిర్మించాం. అయితే దానిపై నేను సంతృప్తి చెందలేదు. మీలో చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక్కడకు రాక ముందే నా అధికారులతో మాట్లాడాను. ఆ కాంట్రాక్టర్ను తప్పించి కొత్తగా టెండర్ పిలవాలని చెప్పా. త్వరలో మంచి రోడ్డు అందుబాటులోకి వస్తుంది. మీరు ఇప్పటి వరకు ఎదుర్కొన్న ఇబ్బందులకు నేను క్షమాపణలు కోరుతున్నాను’ అని అన్నారు. దీంతో ఆ సభకు హాజరైన ప్రజలు చప్పట్లతో గడ్కరీ నిజాయితీని అభినందించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

