Uttar Pradesh: భార్యను కుర్చీకి కట్టేసి.. పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన భర్త
Uttar Pradesh: వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు భార్యను అనుమానించిన భర్త ఆమెను చంపేశాడు. భార్యను కుర్చీకి కట్టి, ఆమెపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టాడు. ఆ తర్వాత ఇద్దరు పిల్లల్ని తీసుకుని అతను పరారీ అయ్యాడు. యూపీలో ఈ ఘటన జరిగింది.
కన్నౌజ్: ఉత్తరప్రదేశ్(Uttar Pradesh)లోని కన్నౌజ్ జిల్లాలో దారుణం జరిగింది. వివాహేతర సంబంధం పెట్టుకున్న భార్యను అత్యంత క్రూరంగా చంపేశాడు భర్త. ఆ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. జగత్పూర్ గ్రామానికి చెందిన 30 ఏళ్ల సోనమ్‌ను కుర్చీకి కట్టేసిన భర్త, ఆమెపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టాడు. ఈ ఘటన తర్వాత తన ఇద్దరు కుమారులతో పరారీ అయ్యాడు సుక్భీర్ సింగ్. పారిపోయే ముందు ఇంటికి కూడా నిప్పు పెట్టాడతను. అయితే మంటల్ని ఆర్పిన తర్వాత సోనమ్ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.
సోనమ్, సుక్బీర్ 11 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. హర్యానాలోని హిసార్‌లో సుక్బీర్ ప్రైవేటు జాబ్ చేస్తున్నాడు. 15 రోజుల క్రితం అతను తిరిగి గ్రామానికి చేరుకున్నాడు. అయితే తన భార్య స్థానిక యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు సుక్బీర్ అనుమానించాడు. ఆ తర్వాత ఆమెపై నిఘా పెట్టాడు. అతడితో ఫోన్లో భార్య మాట్లాడడం గమనించిన భర్తకు మరింత అనుమానం పెరిగింది. దీంతో ఆ ఇద్దరి మధ్య గొడవ జరిగింది.
కొన్ని రోజుల క్రితం పెద్ద మనుషుల మధ్య పంచాయతీ జరిగింది. యువకుడితో మాట్లాడబోనని సోనమ్ ఒప్పుకున్నది. భర్తతోనే ఉండేందుకు ఆమె అంగీకరించింది. అయితే రిలేషన్ పెట్టుకున్న యువకుడి ఆ రోజే విషం తాగి ఆస్పత్రి పాలయ్యాడు. ప్రస్తుతం అతను కోలుకుంటున్నాడు. కానీ మళ్లీ భార్యాభర్తల మధ్య గొడవ జరగడంతో.. గురువారం ఉయదం ఏడు గంటలకు సోనమ్‌ను కుర్చీకి కట్టిన సుక్బీర్, ఆమెపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టాడు. ఇంటిని మంటలు చుట్టుకోవడంతో ఆమె అరుపులు విని స్థానికులు అలర్ట్ అయ్యారు. పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం చేరవేశారు.
మంటల్ని ఆర్పేందుకు గంటన్నర సమయం పట్టింది. అయితే ఇంట్లోకి వెళ్లగానే సోనమ్ అవవేశాలు మిగిలి ఉన్నట్లు గుర్తించారు. నిందితుడు సుక్బీర్ పరారీలో ఉన్నాడు. అతన్ని పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Uttar Pradesh: భార్యను కుర్చీకి కట్టేసి.. పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన భర్త
కారేపల్లిలో పశువుల సంత వేలం ఖరారు
Nayanthara | పట్టుచీరలో నయనతార.. కాళికాంబాల్ ఆలయంలో ప్రత్యేక పూజలు,మహిళలకు చీరలు, పండ్ల పంపిణీ!
Midday meal | నారాయణగిరి ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన వంట వివాదం
హైదరాబాద్ పాతబస్తీలో కలకలం.. మదర్సాలో 11 ఏళ్ల బాలుడిపై లైంగిక వేధింపులు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

