Human Diseases: 2100 నాటికి వ్యాధుల నిర్మూలనే లక్ష్యం.. చాన్ జుకర్‌బర్గ్ సంస్థ ప్రకటన
Human Diseases: ప్రిశ్చిల్లా చాన్, మార్క్ జుకర్‌బర్గ్ కీలక ప్రకటన చేశారు. 2100 సంవత్సరం నాటికి మనుషుల్లో వ్యాధుల్ని నిర్మూలించే వ్యవస్థను డెవలప్ చేయనున్నట్లు చెప్పారు. ఈ ప్రాజెక్టు కోసం సుమారు వెయ్యి జీపీయూలతో అతిభారీ డేటాబేస్‌ను తయారు చేయనున్నారు. ఆరోగ్యకరమైన, వ్యాధి సోకిన కణాలను ఆ డేటాబేస్ ద్వారా స్టడీ చేస్తారు.
న్యూఢిల్లీ: మనుషుల్లో నమోదు అయ్యే అన్ని రకాల వ్యాధుల(Human Diseases)ను నిర్మూలించే ఉద్దేశంతో చాన్ జుకర్‌బర్గ్ సంస్థ ఉన్నట్లు తెలుస్తోంది. 2100 సంవత్సరం నాటికి అన్ని వ్యాధులకు చెందిన డేటా బేస్‌ను తయారు చేయాలని ఆ సంస్థ ప్రయత్నిస్తోంది. చాన్ ఫౌండేషన్‌కు చెందిన చాన్ జుకర్‌బర్గ్ ఇన్సియేటివ్(సీజెడ్ఐ) దీనిపై ప్రకటన చేసింది. 2100 నాటికి కంప్యూటింగ్ సిస్టమ్‌ను డెవలప్ చేయాలని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పరిశోధకులు ఆ డేటాను స్టడీ చేసి వ్యాధుల నిర్మూలనకు ప్రయత్నం చేసే అవకాశాలు ఉన్నట్లు సీజెడ్ఐ తెలిపింది.
మెటా సంస్థ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్, ఆయన భార్య ప్రిశ్చిల్లా చాన్ దీనిపై తాజాగా ప్రకటన చేశారు. కణాలను క్యాటలాగ్ చేసి, వాటి వల్ల కలిగే వ్యాధులపై స్టడీ చేయనున్నట్లు వెల్లడించారు. ఆ డేటాను వ్యాధుల చికిత్సకు సంబంధించిన కీలకమైన ఆవిష్కరణలకు వాడుకోనున్నట్లు తెలిపారు. ఈ శతాబ్ధం చివరలోగా అద్భుతమైన ఆవిష్కరణలు చోటుచేసుకునే అవకాశం ఉందన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా బయోమెడిసిన్‌లో ఎన్నో అవకాశాలు వస్తున్నట్లు చెప్పారు.
కణాలను అధ్యయనం చేసే సామర్థ్యం ఉన్న డిజిటల్ మోడల్స్‌ను డెవలప్ చేస్తున్నామని, దీని ద్వారా పరిశోధకులు మన కణాల ప్రవర్తనను అంచనా వేయగలరని, వ్యాధుల సమయంలో కలిగే పరివర్తనలను గుర్తించగలరని జుకర్‌బర్గ్ తన ప్రటకనలో తెలిపారు. ఆరోగ్యకరమైన, వ్యాధి సోకిన కణాలను ఏఐ ద్వారా స్టడీ చేయనున్నట్లు చెప్పారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

