Fire Accident | దేశ రాజధాని ఢిల్లీ (Delhi) సమీపంలోని గ్రేటర్ నోయిడా (Greater Noida)లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. నోయిడాలోని గౌర్ సిటీ (Gaur City)లో గల 14 అవెన్యూ సొసైటీ (14 Avenue society) లోని రెసిడెన్షియల్ టవర్స్ (residential towers)లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ముందు రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌లోని రెండో అంతస్తులో మంటలు చెలరేగి అవి పై అంతస్తు వరకు వ్యాపించినట్లు తెలుస్తోంది.
భారీగా మంటలు ఎగసిపడుతుండటంతో అప్రమత్తమైన సొసైటీ సిబ్బంది ( society maintenance staff) మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దీంతో వారు స్థానిక పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి (fire brigade) సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపుచేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు ఎవరికీ ఎటువంటి గాయాలు అయినట్లు సమాచారం లేదు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
Also Read..
Priyanka Gandhi | హోటల్లో దోశలు వేసిన ప్రియాంక గాంధీ.. వీడియో వైరల్..!
Passengers Fighting In Flight | విమానం గాల్లో ఉండగా కొట్టుకున్న ప్రయాణికులు.. నలుగురు అరెస్ట్