ఐసోలేషన్‌లో తీరథ్.. అదే ఆయనకు శాపమైందా !
తీరథ్ సింగ్ | ఉత్తరాఖండ్ సీఎం బాధ్యతల నుంచి తీరథ్ సింగ్ రావత్ తప్పుకున్న విషయం తెలిసిందే. 115 రోజుల పాటు సీఎంగా ఉన్న ఆయన అనూహ్య రీతిలో తన

డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్ సీఎం బాధ్యతల నుంచి తీరథ్ సింగ్ రావత్ తప్పుకున్న విషయం తెలిసిందే. 115 రోజుల పాటు సీఎంగా ఉన్న ఆయన అనూహ్య రీతిలో తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఎంపీగా ఉన్న ఆయన ఏదైనా స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలిస్తేనే సీఎంగా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. నిజానికి తీరథ్ సింగ్ విషయంలో ఓ విచిత్ర పరిస్థితి ఎదురైంది. కోవిడ్ సంక్షోభం వల్ల ఏకంగా ఆయన తన సీఎం పదవిని కోల్పోవాల్సి వచ్చింది. ఈ ఏడాది మార్చి 10వ తేదీన ఉత్తరాఖండ్ సీఎంగా తీరథ్ బాధ్యతలు స్వీకరించారు. కానీ ఆయన సీఎం నివాసానికి కూడా వెళ్లలేదు. సీఎం నివాసాన్ని కోవిడ్ కేర్ సెంటర్‌గా ప్రకటించిన ఆయన.. తన స్వంత ఇంట్లోనే ఉన్నారు. అయితే మార్చి 22వ తేదీన రావత్‌కు కోవిడ్ సంక్రమించింది. దీంతో ఆయన సెల్ఫ్ ఐసోలేషన్లోకి వెళ్లారు. కానీ మార్చి 23వ తేదీన ఎన్నికల సంఘం సాల్ట్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక ప్రకటించింది.
పాజిటివ్‌గా ఉన్న తీరథ్.. ఆ సమయంలో ఆ స్థానం కోసం పోటీ చేయలేకపోయారు. వాస్తవానికి సాల్ట్ అసెంబ్లీ స్థానం నుంచి తీరథ్‌ను గెలిపించాలన్న ఉద్దేశంలో బీజేపీ ఉంది. కానీ 14 రోజులు ఐసోలేషన్‌లో ఉన్న రావత్ మళ్లీ ఏప్రిల్ 4వ తేదీన నెగటివ్‌గా బయటకు వచ్చారు. అయితే సాల్ట్ నియోజకవర్గానికి నామినేషన్ వేయడానికి మార్చి 30వ తేదీ చివరి తేదీ కావడం తీరథ్‌ను ఇరకాటంలో పడేసినట్లు అయ్యింది. ఎంపీగా రాజీనామా చేసి.. ఆరు నెలల లోపు ఎమ్మెల్యేగా గెలిస్తేనే సీఎం పదవిలో ఆయన కొనసాగే అవకాశం ఉంది. కానీ ఆర్నెళ్ల గడువు సమీపస్తున్న తరుణంలో తీరథ్‌కు ఆ రూటు కష్టంగా మారింది. ఎందుకంటే ఇప్పట్లో ఈసీ మళ్లీ ఎన్నికలు నిర్వహించేలా లేదు. సాల్ట్ నియోజకవర్గానికి ఏప్రిల్ 17వ తేదీన జరిగిన ఎన్నికలో బీజేపీ సునాయాస విజయం దక్కించుకున్నది. కోవిడ్ వల్ల ఆ స్థానం నుంచి పోటీ చేయలేకపోయిన తీరథ్‌కు ఇప్పుడు తీవ్ర నిరాశే మిగిలింది. ఏప్రిల్‌లో కుంభమేళా వేళ నిర్వహించిన కోవిడ్ పరీక్షల్లో ఫేక్ రిపోర్ట్లు కూడా తీరథ్ ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తి చూపాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women’s Asian Champions Trophy | చైనాపై భారత్ ఘన విజయం.. ఆసియా హాకీ ఛాంపియన్‌గా హ్యాట్రిక్
Child Marriage | టెంకంపేట్లో బాల్యవివాహానికి బ్రేక్.. అధికారుల చొరవతో నిలిపివేత
Begumpet Students | సిద్దిపేట వైజ్ఞానిక ప్రదర్శనలో బేగంపేట విద్యార్థుల ప్రతిభ.. రాష్ట్రస్థాయికి స్మార్ట్ వాకర్ ప్రాజెక్టు
Myanmar military bombs school | స్కూల్‌పై మయన్మార్ ఆర్మీ బాంబు దాడి.. మహిళలు, పిల్లలతో సహా 30 మంది మృతి
ఓబీసీ కులగణన తర్వాతే డీలిమిటేషన్ చేపట్టాలి.. బీసీ మహిళలకు సబ్‌కోటా కల్పించాలి.. జాజుల శ్రీనివాస్ డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

