ముంబై, మే 16 (నమస్తే తెలంగాణ) : థానే జిల్లాలోని ఉల్హాస్ నగర్ లో మహిళను కొట్టి, ఆమె జుట్టును కత్తిరించి, మెడలో చెప్పుల దండ వేసి నగ్నంగా ఊరేగించారు. ఉల్హాస్ నగర్ ఇన్ స్పెక్టర్ శంకర్ అవ్తాడే కథనం ప్రకారం బాధితురాలు, నిందితులు బంధువులు.
బాధితురాలు తమ దైవం గురించి అవమానకరమైన వ్యా ఖ్యలు చేసింది. దీంతో ఆమెను గుడిలోకి ప్రవేశించవద్దని హెచ్చరించినా వినకపోవడంతో వారు పైశాచికంగా వ్యవహరించారని తెలిపా రు. ఘటన గురువారం జరిగిందని, ముగ్గుర్ని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు.