కంటి చూపుతో కారు డ్రైవింగ్!
‘సెవెన్త్ సెన్స్' సినిమా చూశారా? ఆ చిత్రంలో విలన్ పాత్రధారి తన కండ్లతో తీక్షణంగా చూసి ఎదుటివారిని పూర్తిగా తన ఆధీనంలోకి తెచ్చుకొంటాడు. అచ్చం అలాగే కంటితో చూసి కారును డ్రైవ్ చేస్తే ఎలా ఉంటుంది? వాషింగ్ మెషీన్‌ను, మొబైల్‌ను కూడా కండ్లతోనే ఆపరేట్ చేస్తే బాగుంటుంది కదూ.
- మొబైల్ కూడా ఆపరేట్ చేయొచ్చు
- ఐ ట్రాకింగ్ టెక్నాలజీతో ఇది సులువే
- ‘మ్యాజిక్ 6 ప్రొ’ పేరిట ఐ ట్రాకింగ్ టెక్నాలజీ ఫోన్లను తీసుకొచ్చిన హానర్
హైదరాబాద్, ఫిబ్రవరి 27 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): ‘సెవెన్త్ సెన్స్’ సినిమా చూశారా? ఆ చిత్రంలో విలన్ పాత్రధారి తన కండ్లతో తీక్షణంగా చూసి ఎదుటివారిని పూర్తిగా తన ఆధీనంలోకి తెచ్చుకొంటాడు. అచ్చం అలాగే కంటితో చూసి కారును డ్రైవ్ చేస్తే ఎలా ఉంటుంది? వాషింగ్ మెషీన్‌ను, మొబైల్‌ను కూడా కండ్లతోనే ఆపరేట్ చేస్తే బాగుంటుంది కదూ. ‘ఐ ట్రాకింగ్ టెక్నాలజీ’తో ఇప్పుడు ఇవన్నీ సాధ్యమే. ప్రముఖ టెక్ కంపెనీ హానర్.. ఐ ట్రాకింగ్ టెక్నాలజీతో పనిచేసే వినూత్న స్మార్ట్‌ఫోన్ ‘మ్యాజిక్ 6 ప్రొ’ను తాజాగా తీసుకొచ్చింది. బార్సిలోనాలో జరుగుతున్న మొబైల్ వరల్ట్ కాంగ్రెస్ (ఎండబ్ల్యూసీ)లో ఈ మేరకు ఓ ప్రదర్శనను కూడా ఇచ్చింది. ఈ క్రమంలో ‘ఐ ట్రాకింగ్ టెక్నాలజీ’ గురించి సర్వత్రా చర్చ జరుగుతున్నది.
ఎలా పనిచేస్తుంది?
‘ఐ ట్రాకింగ్ టెక్నాలజీ’ని వినియోగించాలంటే ముందుగా ఏదైనా ఫోన్లో దానికి సంబంధించిన యాప్‌ను ఇన్స్టాల్ చేసుకోవాలి. ఆ క్షణం నుంచి సదరు ఫోన్ ‘ఐ ట్రాకింగ్ టెక్నాలజీ’ పరిధిలోకి వచ్చినట్టే. ఏదైనా ఫోన్ కాల్ వచ్చినప్పుడు మనం ఫోన్ స్క్రీన్‌పై కనిపించే రెడ్ బటన్ (డినైడ్ కాల్) లేదా గ్రీన్ బటన్ (యాక్సెప్ట్ కాల్) వైపునకు చూస్తే చాలు.. మొబైల్ కెమెరా మన కంటిపాపను విశ్లేషించి మనం ఏ బటన్‌ను చూశామో దాన్ని ఆన్ చేస్తుంది. అంతేకాదు.. ఫోన్లో ఉన్న మెనూలో ఏ యాప్ తెరవాలి? ఏమేం షాపింగ్ చేయాలి? వంటి పనులను కూడా చక్కబెడుతుంది. ఫోన్‌ను బ్లూటూత్‌తో కారుకు లేదా వాషింగ్ మెషీన్, టీవీకి అనుసంధానం చేస్తే చాలు.. ఫోన్ కెమెరా ద్వారా కంటిపాప ఆదేశాలను బట్టి ఆయా డివైజ్‌లను కూడా సులభంగా ఆపరేట్ చేయవచ్చు. తాజాగా తీసుకొచ్చిన ‘మ్యాజిక్ 6 ప్రొ’ స్మార్ట్ ఫోన్లో ఈ ఫీచర్లన్నీ పొందుపరిచినట్టు హానర్ కంపెనీ ప్రతినిధులు తెలిపారు.
ఏమిటీ ‘ఐ ట్రాకింగ్ టెక్నాలజీ’?
చేతులతో, వాయిస్ కమాండ్‌తో కాకుండా కండ్లలోని కనుపాప సాయం తో డివైజ్‌లను ఆపరేట్ చేసే సరికొత్త కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికతనే ‘ఐ ట్రాకింగ్ టెక్నాలజీ’గా పిలుస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

