Viral Video | హోలీలో హోయలు.. కదులుతున్న బైక్‌పై ఇద్దరమ్మాయిల రొమాన్స్
Viral Video | ఓ ఇద్దరు అమ్మాయిలు మాత్రం హోలీ పండుగ వేళ తమ హోయలు ఒలకబోశారు. వారిద్దరూ బహిరంగంగా రొమాన్స్ చేస్తూ రెచ్చిపోయారు. ఈ హోలీ రొమాన్స్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
Viral Video | హోలీ పండుగను దేశ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. చాలా మంది యూత్ హోలీ సెలబ్రేషన్స్‌లో పాల్గొని తెగ ఎంజాయ్ చేశారు. ఓ ఇద్దరు అమ్మాయిలు మాత్రం హోలీ పండుగ వేళ తమ హోయలు ఒలకబోశారు. వారిద్దరూ బహిరంగంగా రొమాన్స్ చేస్తూ రెచ్చిపోయారు. ఈ హోలీ రొమాన్స్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
ఢిల్లీకి సమీపంలోని నోయిడాలో ఓ యాక్టివాపై ముగ్గురు వెళ్తున్నారు. అబ్బాయి యాక్టివా నడుపుతుండగా.. అతని వెనుకాల ఇద్దరు అమ్మాయిలు ఎదురెదురుగా కూర్చున్నారు. ఇక యాక్టివా కదులుతుండగానే.. వారిద్దరూ రొమాన్స్‌లో మునిగి తేలారు. ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా వారు కౌగిలింతల్లో మునిగిపోయారు. ఈ వీడియోకు బాలీవుడ్ సాంగ్ మోహి రంగ్ లగడే పాటను ప్లే చేశారు. అమ్మాయిల రొమాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ వీడియోపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా, అభ్యంతరకరంగా వారు ప్రవర్తించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ అమ్మాయిలపై కఠిన చర్యలు తీసుకోవాలని నోయిడా పోలీసులను నెటిజన్లు డిమాండ్ చేశారు. ఈ వీడియోపై పోలీసులు తీవ్రంగా స్పందించారు. వారికి నోయిడా పోలీసులు రూ. 33 వేలు జరిమానా విధించారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన ఆ ముగ్గురిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
#GreaterNoida होली के नाम पर अश्लीलता फैलाने वाली सुशील कन्याएं, दिल्ली मेट्रो का असर ग्रेटर नोएडा तक पहुंच गया, ट्रैफिक पुलिस की संज्ञान में वीडियो आते ही ट्रैफिक पुलिस ने 33000 रूपए का चालान किया। स्कूटी नंबर (UP16CX-0866)@noidapolice @Uppolice #viralvideo @noidatraffic pic.twitter.com/XpMQjWkuKn
— Awareness News (@AwarenessNews1) March 25, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

