న్యూఢిల్లీ, జూలై 28: 31 ఏండ్లుగా హెచ్ఐవీతో బాధపడుతున్న 63 ఏండ్ల వృద్ధుడికి మూలకణ మార్పిడి చికిత్సతో పూర్తిగా నయమైంది. అలాగే బ్లడ్‌క్యాన్సర్ కూడా నయమైంది. బెర్లిన్‌కు చెందిన ఆ వ్యక్తికి 1988లో హెచ్ఐవీ సోకింది. అప్పటి నుంచి యాంటీ రెట్రోవైరల్ థెరపీ తీసుకుంటున్నాడు.
హెచ్ఐవీ వైరస్ నుంచి నిరోధకత కలిగి ఉన్న ఓ వ్యక్తి నుంచి మూలకణాలను తీసి ఎక్కించారు. హెచ్ఐవీ, క్యాన్సర్ నుంచి విముక్తి పొందిన విషయాన్ని ఇటీవల జరిగిన ఇంటర్నేషనల్ ఎయిడ్స్ సొసైటీ సమావేశంలో వెల్లడించారు.