Himachal Pradesh | మరో 24 గంటలు భారీ వర్షాలు.. ఇండ్లకే పరిమితం కావాలన్న హిమాచల్ సీఎం
Himachal Pradesh | న్యూఢిల్లీ : హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాన్ని వర్షాలు ముంచెత్తుతున్నాయి. కొండచరియలు విరిగిపడడంతో పలు ఇండ్లు ధ్వంసమయ్యాయి. భారీ వర్షాల నేపథ్యంలో హిమాచల్‌లోని పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. మరో 24 గంటల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది.
Himachal Pradesh | న్యూఢిల్లీ : హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాన్ని వర్షాలు ముంచెత్తుతున్నాయి. కొండచరియలు విరిగిపడడంతో పలు ఇండ్లు ధ్వంసమయ్యాయి. భారీ వర్షాల నేపథ్యంలో హిమాచల్‌లోని పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. మరో 24 గంటల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో హిమాచల్ ప్రదేశ్ అధికార యంత్రాంగాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ అప్రమత్తం చేశారు. అధికారులందరూ అలర్ట్‌గా ఉండాలని సూచించారు.
భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు తమ ఇండ్లకే పరిమితం కావాలని, అత్యవసరమైతేనే బయటకు రావాలని సూచించారు. అధికారులకు, పోలీసులకు స్థానికులు సహకరించాలని కోరారు. మూడు హెల్ప్ లైన్ నంబర్లను ఏర్పాటు చేశారు. అత్యవసర పరిస్థితుల్లో 1100, 1070, 1077 నంబర్లకు కాల్ చేయాలని సూచించారు. ఈ నంబర్లు 24 గంటలు అందుబాటులో ఉంటాయన్నారు. ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్‌లో 10 నుంచి 13 జిల్లాల్లో రెడ్ అలర్ట్ కొనసాగుతుంది. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 14 మంది మరణించినట్లు సీఎం పేర్కొన్నారు. బాధితులకు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి, సౌకర్యాలు కల్పించాలని అధికారులను సీఎం సింగ్ ఆదేశించారు.
*****सभी प्रदेशवासियों से नदी-नालों के निकट न जाने की अपील*****#WeatherAlert#HeavyRainfallAlert#StaySafe#Stay_Away_from_Water_Bodies pic.twitter.com/WTRxMIXMLn
— Sukhvinder Singh Sukhu (@SukhuSukhvinder) July 9, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

