చెన్నై: ఆర్ట్ ఆఫ్ లీవింగ్ వ్యవస్థాపకుడు శ్రీ శ్రీ రవి శంకర్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఇవాళ అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. తమిళనాడులోని ఈరోడ్ జిల్లాలో ఉన్న సత్యమంగళంలో ఆ హెలికాప్టర్‌ను ఎమర్జెన్సీగా దించారు. హెలికాప్టర్లో శ్రీ శ్రీ రవిశంకర్‌తో పాటు మరో నలుగురు ఉన్నారు. వాతావరణం సరిగా లేని కారణంగా హెలికాప్టర్‌ను అత్యవసరంగా దించినట్లు తెలుస్తోంది. ఉదయం 10.40 నిమిషాలకు హెలికాప్టర్‌ను దించారు. 50 నిమిషాల తర్వాత వెదర్ క్లియర్ కావడంతో ఆ హెలికాప్టర్ ఎగిరింది. ఈ ఘటనకు చెందిన మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.