ట్రమడోల్తో గుండెకు చేటు
నొప్పి నివారిణిగా పేరు పొందిన ట్రమడోల్ వల్ల గుండెకు ముప్పు ఉంటుందని తాజా అధ్యయనం వెల్లడించింది. బీఎంజే ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్లో ప్రచురితమైన అధ్యయన నివేదిక ప్రకారం& ట్రమడోల్ను సాధారణంగా నొప్పుల నుంచి ఉపశమనం కోసం వైద్యులు సూచిస్తూ ఉంటారు.
- నొప్పి నివారిణిగా పేరున్నా ప్రయోజనం తక్కువే
- దీని వాడకంపై పునఃపరిశీలన తప్పనిసరి
న్యూఢిల్లీ: నొప్పి నివారిణిగా పేరు పొందిన ట్రమడోల్ వల్ల గుండెకు ముప్పు ఉంటుందని తాజా అధ్యయనం వెల్లడించింది. బీఎంజే ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్లో ప్రచురితమైన అధ్యయన నివేదిక ప్రకారం& ట్రమడోల్ను సాధారణంగా నొప్పుల నుంచి ఉపశమనం కోసం వైద్యులు సూచిస్తూ ఉంటారు. కానీ దీనివల్ల ప్రయోజనాలు పరిమితంగానే ఉంటాయి. మరోవైపు ఇది గుండె జబ్బులు పెరగడానికి కారణమవుతోంది. ముఖ్యంగా సుదీర్ఘ కాలం వాడినపుడు ఈ ముప్పు తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఈ అధ్యయనంలో 6,506 మందికి చెందిన క్లినికల్ ట్రయల్స్ను సమీక్షించారు. వీరి సగటు వయసు 58 ఏళ్లు. వీరు 2-16 వారాల పాటు ట్రమడోల్ మాత్రలను వాడారు.
దీనివల్ల నొప్పి నుంచి ఉపశమనం చాలా తక్కువేనని వెల్లడైంది. ప్లాసిబోతో పోల్చుకుంటే, ట్రమడోల్ వల్ల తీవ్రమైన దుష్ప్రభావాలు రెట్టింపు ఉంటాయని తెలిసింది. దీనికి కారణం ఛాతీ నొప్పి, కరోనరీ ఆర్టెరీ డిసీజ్, హార్ట్ ఫెయిల్యూర్ వంటి గుండె సంబంధిత సమస్యలు పెరగడమేనని వెల్లడైంది. అమెరికాలో దాదాపు 5.16 కోట్ల మంది అంటే ప్రతి ఐదుగురిలో ఒకరు, తీవ్రమైన నొప్పితో బాధ పడుతున్నట్లు సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తెలిపింది. ఈ నొప్పి నివారణ కోసం ట్రమడోల్ను విస్తృతంగా సూచిస్తున్నారు. దీని వాడకంపై పునః పరిశీలన చేసుకోవలసిన అవసరం ఉందని తాజా అధ్యయనం స్పష్టం చేస్తున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

