సప్తపది లేని పెండ్లి చెల్లదు
కేవలం వివాహ ధ్రువీకరణ సర్టిఫికెట్ ఉన్నంత మాత్రాన ఆ పెండ్లి చెల్లుబాటు కాదని గుజరాత్ హైకోర్టు తీర్పు చెప్పింది. హిందూ వివాహ చట్టం ప్రకారం ఆచారాలకు అనుగుణంగా పెండ్లి క్రతువులు నిర్వహించినప్పుడు మాత్రమే దానికి చట్టబద్ధమైన గుర్తింపు ఉంటుందని న్యాయస్థానం స్పష్టం చేసింది.
- రిజిస్ట్రేషన్ చేసినంత మాత్రాన వివాహం అయినట్టు కాదు
- గుజరాత్ హైకోర్టు తీర్పు
అహ్మదాబాద్: కేవలం వివాహ ధ్రువీకరణ సర్టిఫికెట్ ఉన్నంత మాత్రాన ఆ పెండ్లి చెల్లుబాటు కాదని గుజరాత్ హైకోర్టు తీర్పు చెప్పింది. హిందూ వివాహ చట్టం ప్రకారం ఆచారాలకు అనుగుణంగా పెండ్లి క్రతువులు నిర్వహించినప్పుడు మాత్రమే దానికి చట్టబద్ధమైన గుర్తింపు ఉంటుందని న్యాయస్థానం స్పష్టం చేసింది.
ఏ సమాజాలలో నైతే సప్తపది (అగ్ని సాక్షిగా ఏడు అడుగులు) ఆచారం అమల్లో ఉందో అక్కడ ఆ తంతు తప్పనిసరిగా నిర్వహించాలని, అది చేయకపోతే ఆ వివా హం చెల్లుబాటు కాదని పేర్కొన్నది. అప్పటికే జరిగిపోయిన వివాహానికి ఇచ్చే పెండ్లి సర్టిఫికెట్ కేవలం ఒక పత్ర రూప సాక్ష్యం మాత్రమేనని, ఆచారాలు లేని పెండ్లి చెల్లదని బెంచ్ తెలిపింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

