video | పారాసెయిలింగ్ తాడు తెగి.. సముద్రంలో పడిన జంట

డయ్యూ: పారాసెయిలింగ్ తాడు తెగడంతో ఒక జంట సముద్రంలో పడింది. కేంద్ర పాలిత ప్రాంతం డయ్యూలో ఈ ఘటన జరిగింది. గుజరాత్‌కు చెందిన అజిత్ కథద్, భార్య సరళతో కలిసి ఆదివారం గుజరాత్‌లోని ఉనా తీరం బీచ్‌లో పారాసెయిలింగ్ చేశారు. పడవలో ఉన్న అజిత్ సోదరుడు రాకేశ్ దీనిని వీడియో తీశారు. అయితే ఆ దంపతులు చాలా ఎత్తుకు ఎగిరిన తర్వాత పడవ, పారాసెయిలింగ్ మధ్య ఉన్న తాడు తెగిపోయింది. దీంతో ఆ జంట సముద్రంలో పడిపోయింది.
కాగా, ఈ ప్రమాదంలో అజిత్, ఆయన భార్యకు ఎలాంటి గాయాలు కాలేదు. వారు లైఫ్ జాకెట్లు ధరించడంతో సముద్రంలో మునిగిపోకుండా నీటిపై తేలారు. బీచ్ రెస్క్యూ సిబ్బంది వెంటనే వారిని కాపాడారు. ఈ ఘటనపై వారు చాలా ఆందోళన చెందారు. తన భార్య చాలా సేపు షాక్‌లో ఉన్నదని అజిత్ తెలిపారు. తాము లైఫ్ జాకెట్లు ధరించడంతో ప్రాణాలతో బయటపడ్డామని చెప్పారు.
పారాసెయిలింగ్ బోటు సిబ్బంది తమను పట్టించుకోలేదని అజిత్ ఆరోపించారు. కొంత సేపటి తర్వాత రెస్క్యూ సిబ్బంది వచ్చి తమను కాపాడినట్లు ఆయన తెలిపారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై అధికారులు చర్యలు తీసుకోవాలని అజిత్ సోదరుడు డిమాండ్ చేశారు. మరోవైపు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
@VisitDiu @DiuTourismUT @DiuDistrict @VisitDNHandDD
— Rahul Dharecha (@RahulDharecha) November 14, 2021
Parasailing Accident,
Safety measures in India,
and they said very rudely that this is not our responsibility. Such things happens. Their response was absolutely pathetic.#safety #diu #fun #diutourism #accident pic.twitter.com/doN4vRNdO8
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Roller | పాలపిట్టను విడుదల చేసిన ఘటనపై కేసు నమోదు
World Cup | ఇండియాలో వరల్డ్ కప్ టోర్నీకి పాకిస్తాన్ దూరం.. జట్టు పర్యటనకు అనుతివ్వని పీసీబీ
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Muskan Rastogi | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. జైలులోనే నిందితురాలు, 10 నెలల కూతురు.. చిన్నారి దత్తత కోరుతూ పిటిషన్
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

