గుజరాత్ సీఎం రూపానీ రాజీనామా

- తదుపరి ముఖ్యమంత్రి నితిన్ పటేల్?
- బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఆరు నెలల్లో
- నలుగురు ముఖ్యమంత్రుల మార్పు
అహ్మదాబాద్, సెప్టెంబర్ 11: గుజరాత్ సీఎం విజయ్ రూపానీ శనివారం తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని గవర్నర్ ఆచార్య దేవవ్రతకు సమర్పించారు. ‘రాష్ర్టాభివృద్ధి కోసం నా వంతు సహకారం అందించాను. భవిష్యత్తులోనూ పార్టీ ఏ బాధ్యతలు అప్పగించినా నిర్వర్తిస్తాను’ అని రాజీనామా తర్వాత విలేకరులతో అన్నారు. బీజేపీలో పార్టీ కార్యకర్తల బాధ్యతలు సమయానుకూలంగా మారుతాయని, ఇది పార్టీ సంప్రదాయం అని పేర్కొన్నారు. రాష్ర్టానికి తదుపరి ముఖ్యమంత్రి ఎవరన్నది పార్టీనే నిర్ణయిస్తుందని చెప్పారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సీఆర్ పాటిల్‌తో తనకు ఎలాంటి విభేదాలు లేవన్నారు.
పాటిదార్లను ఆకర్షించడానికేనా?
గుజరాత్లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో రూపానీ రాజీనామా ప్రాధాన్యం సంతరించుకొన్నది. గుజరాత్లో పటేల్ సామాజిక వర్గంలో ఒకరికి సీఎం పదవి ఇచ్చి వారిని తమ వైపునకు తిప్పుకొనేందుకే బీజేపీ రూపానీతో రాజీనామా చేయించినట్టు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గుజరాత్ తరువాతి సీఎం పాటిదార్ వర్గం నుంచి ఉంటారని భావిస్తున్నారు. ఇందులో గుజరాత్ డిప్యూటీ సీఎం నితిన్ పటేల్ పేరు ఎక్కువగా వినిపిస్తున్నది.
ఉత్తరాఖండ్‌తో మొదలు
బీజేపీ పాలిత రాష్ర్టాల్లో సీఎంల మార్పు తీవ్ర చర్చనీయాంశం అవుతున్నది. ఆరు నెలల్లో బీజేపీ పాలిత రాష్ర్టాల్లో నలుగురు సీఎంలు మారారు. ఉత్తరాఖండ్‌లో తొలుత త్రివేంద్ర సింగ్ రావత్‌ను తప్పించి తీరథ్ సింగ్ రావత్‌కు, నెలల వ్యవధిలోనే ఆయనను దించేసి పుష్కర్‌సింగ్ ధామీకి పదవిని కట్టబెట్టారు. కర్ణాటకలో సీనియర్ నేత యెడియూరప్ప స్థానంలో బీఎస్ బొమ్మైని నియమించారు. తాజాగా రూపానీ రాజీనామా చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

