ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. దేశవ్యాప్తంగా పెళ్లి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. కొన్ని పెళ్లివేడుకల్లో వింత, నవ్వు తెప్పించే సంఘటనలు జరుగుతున్నాయి. ఆ వీడియోలు సోషల్మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఓ వరుడు.. వధువు మెడలో పూలమాల వేయగానే అతడి ప్యాంటు ఊడిపోయిన వీడియో ఒకటి ఆన్లైన్లో చక్కర్లు కొడుతోంది. నెటిజన్ల మోముపై నవ్వులు పూయిస్తోంది.
ఈ వీడియోను ‘బంటీకే మీమ్స్’ అనే యూజర్ ఇన్స్టాలో షేర్ చేశారు. వధూవరుల జయమాల కార్యక్రమం జరుగుతోంది. మొదట వరుడి మెడలో వధువు మాల వేసింది. అనంతరం వరుడు..వధువు మెడలో మాల వేయగానే, అతడి పైజామా జారిపోయింది. ఇదిచూసి వధువుకూడా నవ్వాపుకోలేకపోయింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు భలే నవ్వుకుంటున్నారు.