రాజ్యాంగ నైతికత దేశ విభిన్నత్వానికి అవసరం
రాజ్యాంగ నైతికతను న్యాయవ్యవస్థలో అమలు చేయడం దేశ విభిన్నత్వానికి అవసరమని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ అన్నారు. భారత రాజ్యాంగానికి న్యాయమూర్తులు సేవకులు మాత్రమే, యజమానులు కాదని తెలిపారు.
- జడ్జీలను దేవుళ్లుగా చూడటం ప్రమాదకరం: సీజేఐ
న్యూఢిల్లీ: రాజ్యాంగ నైతికతను న్యాయవ్యవస్థలో అమలు చేయడం దేశ విభిన్నత్వానికి అవసరమని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ అన్నారు. భారత రాజ్యాంగానికి న్యాయమూర్తులు సేవకులు మాత్రమే, యజమానులు కాదని తెలిపారు. న్యాయమూర్తుల వ్యక్తిగత విలువలు, విశ్వాసాలు, జోక్యం.. వంటివి రాజ్యాంగ విలువలకు విరుద్ధమైన తీర్పుల్ని తీసుకొస్తాయని హెచ్చరించారు.
కోల్కతాలో ఆయన ఓ కార్యక్రమంలో ప్రసంగించారు. న్యాయశాస్త్రంలో రాజ్యాంగ నైతికత అమలు..గురించి వివరించారు. కోర్టులను దేవాలయాలుగా, జడ్జిలను దేవుళ్లుగా చూస్తే..అది చాలా ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజా ప్రయోజనాలను నెరవేర్చటమే న్యాయమూర్తుల ప్రధాన కర్తవ్యమన్నారు.‘మమ్మల్ని లార్డ్షిప్, లేడీషిప్..అంటూ గౌరవంగా సంబోధిస్తారు. ప్రజలకు సేవకుడిగా ఉండటమే జడ్జి పాత్ర’ అని జడ్జిలను ఉద్దేశించి సీజేఐ అన్నారు. సుప్రీంకోర్టు, హైకోర్టుల్లోనూ కాదు, రాజ్యాంగ నైతికత జిల్లా న్యాయవ్యవస్థకు కూడా వర్తిస్తుందన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- CJI Chandrachud
- court
- god
- judge
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

