Girl Raped | కొన్ని నెలలుగా అత్యాచారం, గర్భం దాల్చిన బాలిక.. తాత, తండ్రి, మరో వ్యక్తి అరెస్ట్
Girl Raped | ఇంట్లోని కుటుంబ సభ్యులు బాలికపై పలు నెలలుగా అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో ఆమె గర్భం దాల్చింది. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ బాలిక తాత, తండ్రి, బంధువైన వ్యక్తిని అరెస్ట్ చేశారు.
లక్నో: ఇంట్లోని కుటుంబ సభ్యులు బాలికపై పలు నెలలుగా అత్యాచారానికి పాల్పడ్డారు. (Girl Raped) దీంతో ఆమె గర్భం దాల్చింది. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ బాలిక తాత, తండ్రి, బంధువైన వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్లోని ఔరైయ్యా జిల్లాలో ఈ దారుణ సంఘటన జరిగింది. డిసెంబర్ 27న బిదునా పోలీస్ స్టేషన్ ప్రాంతానికి చెందిన మైనర్ బాలిక తన బంధువైన మహిళతో కలిసి స్థానిక పోలీస్ స్టేషన్కు చేరుకున్నది. గత కొన్ని నెలలుగా తాత, తండ్రి, బంధువు పలుమార్లు తనపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆమె ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో వైద్య పరీక్షల కోసం ఆ బాలికను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీంతో ఆమె రెండు నెలల గర్భవతిగా నిర్ధారణ అయ్యింది.
కాగా, బాధిత బాలిక ఫిర్యాదుపై పోలీసులు స్పందించారు. పోక్సో చట్టంతోపాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. గత కొన్ని నెలలుగా ఆమెపై అత్యాచారానికి పాల్పడిన తాత, తండ్రి, బంధువైన మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- arrested
- Father
- Girl
- grandfather
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

