Lakshadweep | లక్షద్వీప్ పర్యాటకానికి ఊతం.. కొత్త ఎయిర్‌పోర్ట్‌ను నిర్మించనున్న కేంద్రం..!
Lakshadweep | బాయ్‌కాట్ మాల్దీవులు హ్యాష్‌ట్యాగ్ సోషల్ మీడియాలో ఇంకా ట్రెండవుతున్నది. ఆ దేశ మంత్రుల వ్యాఖ్యల నేపథ్యంలో భారతీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నది.
Lakshadweep | బాయ్‌కాట్ మాల్దీవులు హ్యాష్‌ట్యాగ్ సోషల్ మీడియాలో ఇంకా ట్రెండవుతున్నది. ఆ దేశ మంత్రుల వ్యాఖ్యల నేపథ్యంలో భారతీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నది. లక్షద్వీప్ మినీకాయ్ ద్వీపంలో కొత్త విమానాశ్రయాన్ని నిర్మించాలని కేంద్రం యోచిస్తున్నట్లు సమాచారం. దీంతో లక్షద్వీప్‌లో పర్యాటకరంగం మరింత పెరుగుతుందని భావిస్తున్నది. కొత్తగా విమానాశ్రయం నిర్మిస్తే మిలటరీకి సైతం ఎంతో ఉపయుక్తంగా ఉండనున్నది. పౌర విమానాలతో పాటు మిలటరీ ఎయిర్‌క్రాఫ్ట్‌లు, ఫైటర్ జెట్స్‌కు కొత్త ఎయిర్పోర్ట్ జాయింట్ ఎయిర్‌ఫీల్డ్‌గా ఉంటుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
సైనికపరంగా కొత్త విమానాశ్రయం నిర్మాణంతో అరేబియా సముద్రం, హిందు మహాసముద్రం పర్యవేక్షణలో భారత్‌కు వ్యూహాత్మకంగా సహాయపడుతుంది. మినీకాయ్ ద్వీపంలో ఎయిర్‌స్ట్రిప్ నిర్మించాలని ఇండియన్ కోస్ట్ గార్డ్ గతంలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. తాజాగా ప్రతిపాదనలో భారత వైమానిక దళం కార్యకలాపాలకు అవకాశం ఇచ్చేందుకు నిర్ణయించినట్లు తెలుస్తున్నది. ప్రస్తుతం ప్రపంచం దృష్టి మొత్తం లక్షద్వీప్‌పైనే ఉన్నది. మినీకాయ్‌లో విమానాశ్రయం నిర్మాణం చేపడితే లక్షద్వీప్‌లో పర్యాటకం సైతం మరింత అభివృద్ధి చెందుతుందని ప్రభుత్వం భావిస్తున్నది. ప్రస్తుతం లక్షద్వీప్‌లోని అగట్టి ద్వీపంలో ఎయిర్‌స్ట్రిప్ ఉంది.
కానీ అన్ని రకాల విమానాలు ఇక్కడ దిగలేవు. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ లక్షద్వీప్‌లో పర్యటించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి లక్షద్వీప్ ట్రెండింగ్‌లోకి వచ్చింది. సోషల్ మీడియాలో మోదీ షేర్ చేసిన చిత్రాలను చూసిన నెటిజన్స్ లక్షద్వీప్‌ను మాల్దీవులతో పోల్చారు. ఈ క్రమంలో మాల్దీవుల మంత్రులు భారత్‌తో పాటు ప్రధానిపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. దీనిపై భారత ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ వివాదం తర్వాత ప్రధాని మోదీపై వ్యాఖ్యలు చేసిన మంత్రులను మాల్దీవులు ప్రభుత్వం వేటు వేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
Iran Nuclear Programme | ఇరాన్ ‘అణు’ గుట్టు చెబితే 20 మిలియన్ డాలర్లు
Sai Durga Tej | చిన్ననాటి స్నేహితురాలితో పెళ్లికి సిద్ధమైన సాయి దుర్గా తేజ్.. కాబోయే భార్యకు స్పెషల్ లవ్ లెటర్!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

