ఏఎఫ్ఎస్పీఏ చట్టాన్ని రద్దు చేయాలి : అసదుద్దీన్ ఓవైసీ

న్యూఢిల్లీ: ఏఐఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఇవాళ లోక్‌సభలో మాట్లాడారు. ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్(ఏఎఫ్ఎస్పీఏ) చట్టాన్ని తక్షణమే ప్రభుత్వం రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఏ దేశంలోనూ ఇలాంటి రాక్షస చట్టం లేదన్నారు. నాగాలాండ్‌లో జరిగిన ఆర్మీ కాల్పుల ఘటనను ఖండించిన ఆయన.. హంతకులను ప్రాసిక్యూట్ చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇస్తుందా అని ఆయన అడిగారు. అణిచివేతకు, ద్వేషానికి ఆఫ్సా సింబల్‌గా మారిందని ఆరోపించారు. ఇన్ఫార్మర్గా సమాచారం ఇచ్చినవాళ్లు చైనాకు చెందిన వ్యక్తులా అని ఓవైసీ ప్రశ్నించారు.
కూలీలను కాల్చేసిన ఆర్మీ…
నాగాలాండ్‌లో శనివారం భద్రతా బలగాలు చేపట్టిన తీవ్రవాద నిరోధక ఆపరేషన్‌లో భారీ తప్పిదం జరిగింది. ఓ వాహనంలో వెళ్తున్న కూలీలను తీవ్రవాదులుగా పొరబడిన బలగాలు వారిపైకి కాల్పులు జరిపాయి. మోన్ జిల్లాలో మధ్యాహ్నం జరిగిన ఈ ఘటనలో ఆరుగురు పౌరులు అక్కడికక్కడే చనిపోయారు. దీనిపై స్థానికుల్లో ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. సాయంత్రం స్థానికులంతా సైన్యాన్ని చుట్టుముట్టారు. ఆత్మ రక్షణ కోసం బలగాలు మళ్లీ ప్రజలపైకి కాల్పులు జరిపాయి. ఈ సారి కాల్పుల్లో ఏడుగురు పౌరులు చనిపోయారు. భద్రతా బలగాల కాల్పుల్లో మొత్తంగా 13 మంది సాధారణ పౌరులు మృతి చెందారు. 11 మంది గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నది. తర్వాత చెలరేగిన హింసలో మరో పౌరుడు, ఒక సైనికుడు కూడా చనిపోయాడు. మరికొంత మంది సైనికులకు గాయాలయ్యాయి. ఉద్రిక్తతల నేపథ్యంలో మోన్ జిల్లాలో కర్ఫ్యూ విధించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
పానగల్ ఛాయా సోమేశ్వరాలయ అభివృద్ధికి రూ.20 కోట్లు మంజూరు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

