ప్రభుత్వం, ప్రజల నిర్లక్ష్యం వల్లనే కరోనా సెకండ్ వేవ్: మోహన్ భగవత్

న్యూఢిల్లీ: దేశంలో కరోనా సెకండ్ వేవ్ పరిస్థితికి ప్రభుత్వంతోపాటు ప్రజల నిర్లక్ష్యం కారణమని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ విమర్శించారు. కరోనా మొదటి వేవ్ తర్వాత ప్రభుత్వం, ప్రజలు సురక్షిత మార్గాలను వదిలేశారని, దీంతో ప్రస్తుత పరిస్థితికి దారి తీసిందని ఆరోపించారు. అయితే ఇలాంటి సంక్షోభ సమయంలో ఒకరిపై ఒకరు వేలెత్తుకునే బదులు కరోనా నియంత్రణకు కలిసికట్టుగా పని చేయాలని దేశ పౌరులకు సూచించారు.
పాజిటివిటీ అన్లిమిటెడ్ పేరుతో ఆన్లైన్లో నిర్వహిస్తున్న వరుస ప్రసంగాల్లో భాగంగా మోహన్ భగవత్ శనివారం కీలక ప్రసంగం చేశారు. కరోనా మూడో వేవ్ పొంచి ఉన్నదన్న ఆయన ప్రజలు భయాందోళన చెందవద్దన్నారు. కరోనా నెగెటివ్‌గా ఉండేందుకు మనం పాజిటివ్‌గా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
దేశంలో ప్రస్తుతం ఉన్న కరోనా పరిస్థితిని రెండో ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటన్ పరిస్థితితో మోహన్ భగవత్ పోల్చారు. అన్ని ఆశలు కోల్పోయినట్లు అనిపించినప్పుడు కూడా, అప్పటి బ్రిటీష్ ప్రధాని విన్స్టన్ చర్చిల్ డెస్క్ మీద ఒక కోట్ ఇలా ఉన్నదని గుర్తు చేశారు. “ఈ కార్యాలయంలో నిరాశావాదం లేదు. ఓటమి అవకాశాలపై మాకు ఆసక్తి లేదు. అవి ఉనికిలో లేవు “అని రాసి ఉన్నదని చెప్పారు. దేశంలో కరోనా మహమ్మారి విరుచుకుపడుతున్న ప్రస్తుత పరిస్థితిలో “ మనం ధైర్యాన్ని కోల్పోకూడదు. మనం ఉక్కు సంకల్పం కలిగి ఉండాలి ”అని ఆయన వ్యాఖ్యానించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

