గువాహటి : భూమి మీద మనుగడ సాగిస్తున్న కొన్ని జంతువులు.. కొన్ని సందర్భాల్లో విచిత్రమైన జీవాలకు జన్మనిస్తుంటాయి. ఆ జీవులను చూస్తుంటే ఆశ్చర్యమేస్తోంది. కొన్ని జంతువులు మనిషి ఆకారాన్ని పోలి ఉంటాయి. అలాంటి అరుదైన ఘటనే అసోంలో వెలుగు చూసింది.
కాచర్ జిల్లాలోని గంగాపూర్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి మేకను పెంచుకుంటున్నాడు. అయితే ఆ మేక ఓ జీవికి జన్మనిచ్చింది. ఆ జీవి మాత్రం మనిషిలా ఆకారాన్ని పోలి ఉంది. తల భాగం మొత్తం మనిషి ఆకారాన్ని పోలి ఉండగా.. కింది భాగం మొత్తం అభివృద్ధి చెందలేదు. ముందరి కాళ్లు మాత్రమే డెవలప్ అయ్యాయి. ఆ జీవి జన్మించిన వెంటనే చనిపోయింది. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు.. ఆ వింత జీవిని చూసేందుకు క్యూ కట్టారు.