పనాజీ: రూమ్ క్లీనింగ్ సాకుతో లోనికి వచ్చిన హోటల్ సిబ్బంది మద్యం మత్తులో నిద్రిస్తున్న రష్యా మహిళపై లైంగిక దాడికి పాల్పడ్డారు. ఉత్తర గోవాలోని కలన్గుట్ ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. రష్యా జాతీయురాలైన 37 ఏళ్ల మహిళ గురువారం గోవాకు వచ్చింది. మరో ఇద్దరితో కలిసి ఒక హోటల్లో బస చేసింది. గోవాలోని పలు ప్రాంతాలను సందర్శించిన తర్వాత గురువారం సాయంత్రం హోటల్ గదికి తిరిగి వచ్చింది. ఒంటరిగా ఉన్న ఆమె మద్యం సేవించి రూమ్‌లో మత్తుగా నిద్రపోయింది.
కాగా, ఆ హోటల్లో పని చేసి ఒక వ్యక్తి తొలుత రూమ్ క్లీనింగ్ సాకుతో లోనికి ప్రవేశించాడు. మద్యం మత్తులో నిద్రపోతున్న రష్యా మహిళను గమనించి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత మరో వ్యక్తి కూడా ఆ రూమ్‌కు వచ్చాడు. రష్యా మహిళపై లైంగిక దాడికి యత్నించాడు. మేల్కోని దీనిని గ్రహించిన ఆమె కేకలు వేసింది.
మరోవైపు బాధితురాలి ఫిర్యాదుతో ఆ హోటల్లో పని చేసే ఇద్దరు సిబ్బందిని పోలీసులు అరెస్ట్ చేశారు. 23 ఏళ్ల వయసున్న నిందితులు సఖిల్ అన్సారీ, సయుధిన్ అన్సారీ నేపాల్ జాతీయులని పోలీస్ అధికారి తెలిపారు.