న్యూఢిల్లీ, డిసెంబర్ 10: గూగుల్ జీమెయిల్ సర్వీసులకు శనివారం రాత్రి 7 గంటల సమయంలో అంతరాయం ఏర్పడింది. జీమెయిల్ సర్వీసులు పనిచేయ డం లేదని పలువురు యూజర్లు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.
రాత్రి 9.45 నిమిషాలకు సర్వీసులను పునరుద్ధరించినట్టు గూగుల్ వివరణ ఇచ్చింది. బ్యాక్లాగ్ మెసేజ్లు మరికొద్ది గంటల్లో డెలివరీ అవుతాయని పేర్కొన్నది.