గ్వాలియర్: ముద్దులతో ముంచెత్తింది ఓ అమ్మాయి. కానీ ఆ ముద్దులన్నీ తన బాయ్‌ఫ్రెండ్ కారుకు ఇచ్చింది. కారు నిండా సుమారు 3400 లిప్‌స్టిక్ మార్కులు(Kiss Marks) పడ్డాయి. అయితే రెండు రోజుల నుంచి గ్వాలియర్ వీధుల్లో ఆ కార్లు చక్కర్లు కొట్టింది. ఆ కారు వీడియో వైరల్ కావడంతో .. ఇక ట్రాఫిక్ పోలీసులు పంజా విసిరారు. ఆ కారుకు 5500 జరిమానా విధించారు. ఇంకా ఆ కారుపై ఉన్న లిప్‌స్టిక్ మార్క్‌లను తొలగించాలని కూడా ఆదేశించారు. స్టోరీలోకి వెళ్తే ..
తన ప్రియుడికి ఓ ప్రియురాలు ప్రేమను చాలా గాఢంగా వ్యక్తం చేసింది. సోషల్ మీడియా స్టంట్ కోసం ఆమె తన బాయ్‌ఫ్రెండ్ కారుకు ఏకంగా వేల సంఖ్యలో కిస్సులు ఇచ్చింది. ఆ కారుపై 3400 లిప్‌స్టిక్ మార్కులు పడ్డాయి. అయితే కారు వీడియో వైరల్ కావడంతో పోలీసులు దాని గురించి ఆరా తీశారు. కారును మాడిఫై చేసినందుకు దాని ఓనర్‌కు ఫైన్ వేశారు. లిప్‌స్టిక్ ముద్రలతో సిటీ సెంటర్లో తిరుగుతున్న కారును గుర్తించినట్లు ట్రాఫిక్ పోలీసు ఇన్స్పెక్టర్ అభిషేక్ రఘువంశీ తెలిపారు. ఆ కారు తాటిపూర్ ఏరియాకు చెందినట్లు పేర్కొన్నారు. కారు డ్రైవర్‌ను పోలీసు స్టేషన్‌కు తరలించారు.
మోటారు వెహికిల్స్ యాక్టు ప్రకారం 5500 ఫైన్ వేశారు. ఇక ఆ కారుపై ఉన్న లిప్‌స్టిక్ ముద్రలను అతనితోనే తూడిపించారు. ఫారిన్ ట్రెండ్‌ను ఫాలోఅవుతున్న తన గర్ల్‌ఫ్రెండ్ ఇలా ఆ కారును తనకు గిఫ్ట్‌గా ఇచ్చినట్లు కారు ఓనర్ ఆదిత్య సికావార్ తెలిపారు. ఇక ఆ కారుపై కిస్సులు పెట్టేందుకు ఆ అమ్మాయికి సుమారు మూడున్నర గంటల సమయం పట్టిందట. కారుపై3400 కిస్సులు పెట్టిన తర్వాత ఆ వీడియోను ఆమె సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది.
కారును అలా అలంకరించడం అక్రమం అని తనకు తెలియదని, లిప్‌స్టిక్‌ను తుడిచివేసేందుకు కారును మొత్తం క్లీన్ చేయాల్సి వచ్చిందన్నాడు. ఫైన్ కూడా కట్టేసినట్లు ఓనర్ చెప్పాడు. చట్టాన్ని ఉల్లంఘించి ఇలాంటి పనులు చేయవద్దు అన్నాడు.