German Chancellor Olaf Scholz: కంటికి ఐ ప్యాచ్తో జీ20 మీటింగ్కు జర్మనీ ఛాన్సలర్.. ఆ ప్యాచ్ ఆయనెందుకు ధరించారంటే
German Chancellor Olaf Scholz: ఓ వారం క్రితం జర్మనీ ఛాన్సలర్ జాకింగ్ చేస్తూ కంటికి దెబ్బతగిలించుకున్నారు. దీంతో ఆయన కుడి కన్నుకు స్వల్పంగా గాయాలు అయ్యాయి. అయితే ఇవాళ జీ20 మీటింగ్కు ఆయన తన కంటికి నల్లరంగు ఐప్యాచ్తో హాజరయ్యారు. భారత మండపంలో ప్రధాని మోదీ ఆయనకు స్వాగతం పలికారు.
న్యూఢిల్లీ: జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ స్కల్జ్(German Chancellor Olaf Scholz).. ఢిల్లీలో జరుగుతున్న జీ20 సమావేశాలకు హాజరయ్యారు. భారత మండపంలో ఉన్న కోణార్క్ వీల్ వద్ద ఇవాళ ఆయనకు ప్రధాని మోదీ షేక్ హ్యాండ్ ఇచ్చి స్వాగతం పలికారు. ఆ సమయంలో స్కల్జ్.. తన కంటికి ఐప్యాచ్ ధరించి ఉన్నారు. సాధారణంగా కంటి ఆపరేషన్ చేయించుకున్న వాళ్లు ధరించే నల్ల రంగు ప్యాచ్ను స్కల్జ్ తన కంటికి ధరించారు. అయితే దీనిపై ఆ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. 65 ఏళ్ల ఛాన్సలర్ గత వారం జాగింగ్ చేస్తూ గాయపడినట్లు ప్రతినిధి తెలిపారు. దీని వల్ల ఆయన కుడి కన్ను దెబ్బతిన్నది.
#WATCH | G-20 in India: German Chancellor Olaf Scholz arrives at Bharat Mandapam, the venue for G 20 Summit in Delhi's Pragati Maidan. pic.twitter.com/PkBvhCKWEO
— ANI (@ANI) September 9, 2023
స్వల్ప స్థాయిలో ఆయన కంటికి గాయాలయ్యాయని, మరికొన్ని రోజుల పాటు స్కల్జ్ ఆ బ్లాక్ కలర్ ఐ ప్యాచ్ ధరించాల్సి ఉంటుందని ప్రతినిధి తెలిపారు. ఎన్నో ఏళ్ల నుంచి ప్రతి రోజూ జాగింగ్ చేసే అలవాటు ఛాన్సలర్ స్కల్జ్కు ఉన్నట్లు ప్రతినిధి స్టీఫెన్ హెబిస్ట్రెయిట్ తెలిపారు.
#WATCH | G-20 in India: German Chancellor Olaf Scholz arrives in Delhi for the G-20 Summit. pic.twitter.com/Q2yopVPQEm
— ANI (@ANI) September 9, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

