నోట్లపై గణపతి, లక్ష్మీదేవి చిత్రాలు
త్వరలో జరుగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అక్కడ పాగా వేయాలని ఉవ్విళ్లూరుతున్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. ఓ కొత్త పాచికను ముందుకు విసిరారు.
- గాంధీ ఫొటోతోపాటు ము్రద్రించాలి
- దేవత చిత్రాలతో దేశానికి మంచి
- ఆర్థిక వ్యవస్థ గాడిలో పడుతది
- ఆప్ నేత కేజ్రీవాల్ ప్రతిపాదన
- హిందూ వ్యతిరేకతను కప్పిపుచ్చేందుకే: బీజేపీ
న్యూఢిల్లీ, అక్టోబర్ 26: త్వరలో జరుగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అక్కడ పాగా వేయాలని ఉవ్విళ్లూరుతున్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. ఓ కొత్త పాచికను ముందుకు విసిరారు. దేశంలో కరెన్సీ నోట్లపై హిందూ దేవతలైన లక్ష్మీదేవి, గణపతి చిత్రాలను ముద్రించాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీని డిమాండ్ చేశారు. ఇప్పుడున్న మహాత్మాగాంధీ చిత్రాన్ని అలాగే కొనసాగిస్తూ నోటుకు మరోవైపు దేవతల చిత్రాలను ముద్రించాలని సూచించారు. బుధవారం ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ దేవతల చిత్రాలు కరెన్సీ నోట్లపై ముద్రిస్తే దేశ ఆర్థిక వ్యవస్థ గాడిలో పడుతుందని, దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందని చెప్పుకొచ్చారు.
దేశానికి విలువ పెరుగుతుంది
కరెన్సీపై దేవతల ఫొటోలు ముద్రిస్తే ప్రపంచంలో భారత్‌కు విలువ పెరుగుతుందని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ‘నేడు ప్రధానమంత్రి నరేంద్రమోదీకి విజ్ఞప్తి చేస్తున్నా.. కరెన్సీ నోట్లపై ఒకవైపు మహాత్మాగాంధీ చిత్రాన్ని అలాగే ఉంచి, మరోవైపు లక్ష్మీదేవి, గణపతి చిత్రాలను ముద్రించండి. మన ఆర్థిక వ్యవస్థ రోజురోజుకూ కుంగిపోతున్నది. ప్రస్తుతం చాలా సున్నితంగా ఉన్నది. ఈ సమయంలో దేశాన్ని మళ్లీ గాడిలో పెట్టేందుకు దేవతల ఆశీర్వాదం అవసరం. ఇప్పటికే చెలామనీలో ఉన్న నోట్ల జోలికి పోవాల్సిన అవసరం లేదు. ప్రతినెలా దేవతల చిత్రాలతో కొన్ని కొత్త నోట్లు ముద్రిస్తే కొంతకాలానికి మార్కెట్లో అవే ఎక్కువ అవుతాయి’ అని పేర్కొన్నారు.
ముందు మీ నేతలను తప్పించండి
కేజ్రీవాల్ ప్రతిపాదనపై బీజేపీ మండిపడింది. ఆయన హిందూ వ్యతిరేక ముఖాన్ని దాచుకోవటానికి ఇలాంటి ప్రతిపాదన ముందుకు తెచ్చారని ఈశాన్య ఢిల్లీ బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ విమర్శించారు. హిందూ దేవతలను అవమానించిన ఢిల్లీ మాజీ మంత్రి రాజేంద్రపాల్ గౌతమ్, గుజరాత్ ఆప్ అధ్యక్షుడు గోపాల్ ఇతాలియాను ఆప్ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు.
2010లోనే ప్రతిపాదన
కరెన్సీ నోట్లపై గాంధీతోపాటు ఇతర ప్రముఖుల చిత్రాలను ముద్రించాలన్న ప్రతిపాదనపై 2010లోనే ఆర్బీఐ నిపుణుల కమిటీని వేసింది. స్వాతంత్య్ర సమరయోధులు, భారతరత్న అవార్డు గ్రహీతలు, ప్రముఖ క్రీడాకారులు, ఎంపిక చేసిన మేధావుల చిత్రాలతో కరెన్సీ నోట్లను ముద్రించాలన్న ప్రతిపాదనపై ఈ కమిటీ అప్పటి మన్మోహన్సింగ్ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. అయితే, భారత్‌కు గాంధీకంటే గొప్ప ప్రతినిధిగా నిలువగల వ్యక్తి ఎవరూ లేరని, కరెన్సీ నోట్లపై ఆయన ఒక్కరి చిత్రమే ఉంటుందని ప్రభుత్వం స్పష్టంచేసింది. ఈ వివరాలను 2019లో ఆర్టీఐ సమాచారం కింద ఆర్బీఐ వెల్లడించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

