Muslim Man Converts To Hinduism To Marry Lover | ప్రియురాలిని పెళ్లాడేందుకు.. హిందూ మతంలోకి మారిన ముస్లిం వ్యక్తి
Muslim Man Converts To Hinduism To Marry Lover | పదేళ్లుగా ప్రేమించిన హిందూ మహిళను పెళ్లాడేందుకు ఒక ముస్లిం వ్యక్తి మతం మారాడు. హిందూ మతాన్ని స్వీకరించడంతోపాటు తన పేరును కూడా మార్చుకున్నాడు. హిందూ ఆచారం ప్రకారం ప్రియురాలిని పెళ్లి చేసుకున్నాడు.
లక్నో: పదేళ్లుగా ప్రేమించిన హిందూ మహిళను పెళ్లాడేందుకు ఒక ముస్లిం వ్యక్తి మతం మారాడు. హిందూ మతాన్ని స్వీకరించడంతోపాటు తన పేరును కూడా మార్చుకున్నాడు. హిందూ ఆచారం ప్రకారం ప్రియురాలిని పెళ్లి చేసుకున్నాడు. (Muslim Man Converts To Hinduism To Marry Lover) ఉత్తరప్రదేశ్‌లోని బస్తి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. నగర్ బజార్ ప్రాంతంలో నివసించే 34 ఏళ్ల సద్దాం హుస్సేన్, అదే గ్రామానికి చెందిన 30 ఏళ్ల హిందూ మహిళ పదేళ్లుగా ప్రేమలో ఉన్నారు. వేర్వేరు మతాలకు చెందినవారు కావడంతో వారిద్దరూ పెళ్లి చేసుకోలేకపోయారు. తనను పెళ్లి చేసుకోవాలని ఆ మహిళ సద్దాంను ఒత్తిడి చేసింది. అయితే ఆమెతో పెళ్లికి అతడి కుటుంబం ఒప్పుకోలేదు.
కాగా, మూడు రోజుల కిందట సద్దాం హుస్సేన్, అతడి కుటుంబ సభ్యులపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఆ మహిళ ఫిర్యాదు చేసింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనపై అత్యాచారం చేశాడని, గర్భస్రావం కోసం బలవంతం చేయడంతోపాటు చంపుతామని వారు బెదిరించినట్లు ఆరోపించింది. దీంతో సద్దాం, అతడి కుటుంబ సభ్యులపై పోలీసులు కేసు నమోదు చేశారు.
మరోవైపు ఈ సంఘటన నేపథ్యంలో సద్దాం హుస్సేన్ హిందూమతంలోకి మారాడు. తన పేరును శివశంకర్‌గా మార్చుకున్నాడు. జనవరి 19న ఆదివారం రాత్రి స్థానిక గుడిలో హిందూ సంప్రదాయం ప్రకారం ఆ మహిళను పెళ్లి చేసుకున్నాడు. పదేళ్లుగా ప్రేమించుకుంటున్న తాము కలిసి జీవించాలని నిర్ణయించామని, అందుకే హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నట్లు వారు చెప్పారు.
A man named Sadam changed his religion to marry a Hindu woman in Uttar Pradesh’s Basti. Watch the video for the unique wedding. #weddingseason #Basti #UPNews #Conversion #Hindu #Muslim pic.twitter.com/uNmOfzXtc2
— Dynamite News (@DynamiteNews_) January 19, 2025
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్‌లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

