Fraud couple | ప్రధాని మోదీ మాకు చాలా దగ్గర.. కాంట్రాక్టులు ఇప్పిస్తాం.. జనానికి కిలాడీ జంట టోకరా..!
Fraud couple | రాజకీయ నాయకులు (Political leaders) తమకు తెలుసని, వారిని కలిపిస్తామని చెబుతూ అమాయక ప్రజల నుంచి డబ్బులు గుంజేవాళ్ల గురించి మనం చాలా సందర్భాల్లో విన్నాం. కానీ ఓ కిలాడీ జంట (Kiladi couple) మాత్రం అంతకంటే హైప్రోఫైల్ మోసాలకు పాల్పడింది.
Fraud couple : రాజకీయ నాయకులు (Political leaders) తమకు తెలుసని, వారిని కలిపిస్తామని చెబుతూ అమాయక ప్రజల నుంచి డబ్బులు గుంజేవాళ్ల గురించి మనం చాలా సందర్భాల్లో విన్నాం. కానీ ఓ కిలాడీ జంట (Kiladi couple) మాత్రం అంతకంటే హైప్రోఫైల్ మోసాలకు పాల్పడింది. ఏకంగా ప్రధాని నరేంద్రమోదీ (Naredra Modi) పేరును అడ్డంపెట్టుకుని కోట్లు కొల్లగొట్టింది. ప్రధాని మోదీ కార్యదర్శి కుటుంబ సభ్యులమని నమ్మించి, కాంట్రాక్టుల పేరుతో అనేక మంది నుంచి కోట్లల్లో కమిషన్లు తీసుకుంది. చివరకు బండారం బయటపడటంతో కటకటాలపాలైంది.
వివరాల్లోకి వెళ్తే.. ఒడిశాకు చెందిన 38 ఏళ్ల హన్సితా అభిలిప్సా (Hansita Abhilipsa), అనిల్ మొహంతి (Anil Mohanty) ఇద్దరూ భార్యాభర్తలు. వీరు భువనేశ్వర్‌లోని ఇన్ఫోసిటీ ప్రాంతంలో ఓ విలాసవంతమైన భవనం అద్దెకు తీసుకుని కార్యాలయాన్ని నిర్వహిస్తున్నారు. అభిలిప్సా తాను ప్రధాని నరేంద్ర మోదీ ప్రధాన కార్యదర్శి పీకే మిశ్రా కూతురునని చెప్పి పలువురిని పరిచయం చేసుకుంది. అందరినీ నమ్మించేందుకు అనేక మంది రాజకీయ ప్రముఖులతో కలిసి దిగిన ఫొటోలను కార్యాలయంలో పెట్టుకుంది. ఆమె భర్త మొహంతి కూడా తాను మిశ్రా అల్లుడినని పలువురిని నమ్మించాడు.
ఈ విధంగా వారు ప్రభుత్వం నుంచి టెండర్లు ఇప్పిస్తామని, ఏవైనా పనులు కావాలన్నా చేసిపెడుతామని ప్రచారం చేసుకున్నారు. వారి మాటలు నమ్మిన వారి నుంచి కమిషన్ల పేరుతో కోట్ల రూపాయలు పిండుకున్నారు. అభిలిప్సా.. మైనింగ్, నిర్మాణం, వ్యాపార రంగాలకు చెందిన ధనవంతులను లక్ష్యంగా చేసుకుని వారితో పరిచయాలు పెంచుకుంది. వారి నుంచి కోట్లు వసూలు చేసింది. అయితే కమిషన్ ముట్టజెప్పినా కాంట్రాక్టులు ఇప్పించకపోవడంతో వారిపై ఈ నెల 26న ఓ వ్యక్తి ఫిర్యాదు చేశాడు. దాంతో కిలాడీ జంట బాగోతం బయటపడింది. పోలీసులు ఆ జంటను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sai Durga Tej | చిన్ననాటి స్నేహితురాలితో పెళ్లికి సిద్ధమైన సాయి దుర్గా తేజ్.. కాబోయే భార్యకు స్పెషల్ లవ్ లెటర్!
Bigg Boss 10 | వర్షిణికి నాగార్జున గట్టి కౌంటర్.. దేబ్జానీకి క్లాస్, నరేష్‌కు షాక్!
Allahabad High Court | యూపీలో సిగ్గుచేటుగా పౌరస్వేచ్ఛ.. రాష్ట్ర హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
Sonia Gandhi | ఎమెర్జెన్సీ విధించడం పొరపాటు నిర్ణయం.. ఆత్మకథలో పేర్కొన్న సోనియా
Agniveer Scheme | మరో రెండేండ్ల సర్వీసు తర్వాత అగ్నివీరులకు పొడిగింపు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

