Medical Students: రష్యా నదిలో మునిగి నలుగురు భారత వైద్య విద్యార్థులు మృతి
Medical Students: రష్యాలో నలుగురు భారతీయ వైద్య విద్యార్థులు నదిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. సెయింట్ పీటర్స్బర్గ్ సమీపంలో ఉన్న నదిలో వాళ్లు మునిగిపోయారు. ఆ విద్యార్థుల మృతదేహాలను భారత్‌కు పంపేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్లు ఇండియన్ ఎంబసీ పేర్కొన్నది.
మాస్కో: రష్యాలో నలుగురు భారతీయ వైద్య విద్యార్థులు(Medical Students) నదిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. సెయింట్ పీటర్స్బర్గ్ సమీపంలో ఉన్న నదిలో వాళ్లు మునిగిపోయారు. ఆ విద్యార్థుల మృతదేహాలను భారత్‌కు పంపేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్లు ఇండియన్ ఎంబసీ పేర్కొన్నది. నోవోగరోడ్ సిటీలో ఉన్న స్టేట్ యూనివర్సిటీలో ఆ విద్యార్థులు వైద్య విద్యను అభ్యసిస్తున్నారు. 18 నుంచి 20 ఏళ్ల మధ్య ఉన్న ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు ప్రాణాలు కోల్పోయారు. ఓ అమ్మాయి నది నీటిలో కొట్టుకుపోతున్న సమయంలో.. ఆమెను రక్షించేందుకు మిగితా ముగ్గురు నదిలోకి దిగారు. అయితే వాళ్లు కూడా ఆ నది నీటిలో మునిగిపోయారు. వాళ్లతో ఉన్న మరో ఓ విద్యార్థి మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. బంధువులకు మృతదేహాలను పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, ప్రాణాలతో బయటపడ్డ ఓ విద్యార్థికి చికిత్స అందిస్తున్నట్లు మాస్కోలోని భారతీయ ఎంబసీ పేర్కొన్నది. బాధిత బంధువులకు సమాచారాన్ని చేరవేసినట్లు అధికారులు తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

