HD Deve Gowda: భార్యతో కలిసి ఓటేసిన మాజీ ప్రధాని దేవగౌడ
HD Devegowda: 89 ఏళ్ల మాజీ ప్రధాని హెచ్డీ దేవగౌడ.. కర్నాటక ఎన్నికల్లో ఓటేశారు. హసన్ జిల్లాలో ఆయన తన సతీమణితో కలిసి పోలింగ్ బూత్‌కు వెళ్లారు. జేడీఎస్ పార్టీ కింగ్‌మేకర్‌గా మారే అవశాలు ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
హసన్: జేడీఎస్ చీఫ్, మాజీ ప్రధాని హెచ్డీ దేవగౌడ(HD Deve Gowda) ఇవాళ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన సతీసమేతంగా ఓటు వేశారు. మాజీ ప్రధాని దేవగౌడ వయసు 89 ఏళ్లు. ఆయన భార్య చెన్నమ్మతో కలిసి వచ్చి ఓటు వేశారు. హసన్ జిల్లాలోని స్వగ్రామమైన హరదనహల్లిలో ఆయన ఓటేశారు. ప్రస్తుతం ఆ గ్రామం హెచ్డీ రేవన్న పరిధిలోకి వస్తుంది. ఇదో చిన్నగ్రామం అని, ఇక్కడ అన్ని రకాల అభివృద్ధి జరిగిందని, హెచ్డీ రేవన్నకు ఆ క్రెడిట్ ఇవ్వాలని హెచ్డీ దేవగౌడ అన్నారు.
మాజీ ప్రధాని దేవగౌడ.. కర్నాటక ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా పాల్గొన్నారు. దాదాపు 90 ఏళ్లు ఉన్న ఆయన.. ఇటీవల అవిశ్రాంతంగా ప్రచారం నిర్వహించారు. హోలెనర్సిపుర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గతంలో ఆయన ఆరుసార్లు గెలిచారు. ఆ నియోజకవర్గంలో ఇటీవల ఆయన పర్యటించారు. 1994లో ఇక్కడ నుంచి గెలిచి ఆయన సీఎం అయ్యారు.
ఈసారి ప్రచారంలో భాగంగా ఆయన 38 అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేశారు. దాదాపు 68 ర్యాలీల్లో ప్రసంగించారు. ఎక్కువ శాతం ఆయన దక్షిణ కర్నాటక ప్రాంతంలోనే పర్యటన చేశారు. కర్నాటకలో యాక్టివ్‌గా ఉన్న అత్యంత వృద్ధ నేతల్లో దేవగౌడ రెండవ వ్యక్తిగా నిలిచారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన 92 ఏళ్ల షమ్మనూరు శివశంకరప్ప ఈసారి దేవనగిరి సౌత్ నుంచి పోటీ చేస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | రణబాలి బాక్సాఫీస్ సెన్సేషన్.. వర్కింగ్ డేలోనూ అదరగొట్టిన విజయ్ దేవరకొండ!
Rowdy-sheeter | పోలీసింగ్ ఎక్కడ? ఏం చేస్తారో చేసుకోండన్న యువకుడు
RC 17 | ఆ తేదీన రామ్ చరణ్-సుక్కూ మూవీ ఓపెనింగ్.. ‘ఆర్సీ 17’ మ్యూజిక్ డైరెక్టర్‌పై మైత్రీ నిర్మాత క్లారిటీ!
Bigg Boss 10 | సీక్రెట్ రూమ్ నుంచి గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చిన షాలిని.. ఇంట్రెస్టింగ్ గేమ్‌లో రామ్ ప్రసాద్ విజయం!
Yusuf Pathan | ఎన్డీయేలో చేరిక.. ప్లాట్ కానుక.. ఇంటిపక్క భూమిని యూసుఫ్‌కి కేటాయించిన గుజరాత్ ప్రభుత్వం
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

