Pradeep Majhi: కులాంతర వివాహం చేసుకున్న మాజీ ఎంపీ.. కుటుంబాన్ని బహిష్కరించిన గిరిజన తెగ
Pradeep Majhi: ఒడిశాకు చెందిన మాజీ ఎంపీ ప్రదీప్ మాఝీ.. సామాజిక వెలివేతకు గురయ్యారు. భాత్రా గిరిజన వర్గానికి చెందిన ఆయన.. ఇటీవల కులాంతర వివాహం చేసుకున్నారు. దీంతో భాత్రా సంఘం ఆయన్ను కులం నుంచి బహిష్కరిస్తున్నట్లు పేర్కొన్నది.
భువనేశ్వర్: ఒడిశాకు చెందిన మాజీ ఎంపీ ప్రదీప్ మాఝీ(Pradeep Majhi).. సామాజిక వెలివేతకు గురయ్యారు. భాత్రా గిరిజన వర్గానికి చెందిన ఆయన.. ఇటీవల కులాంతర వివాహం చేసుకున్నారు. బ్రాహ్మణ కులానికి చెందిన సుశ్రీ సంగీత సాహూను మాజీ ఎంపీ పెళ్లాడారు. కులాంతర వివాహం చేసుకున్న ప్రదీప్ మాఝీపై.. భాత్రా తెగకు చెందిన ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. ఆయన్ను కులం నుంచి బహిష్కరిస్తున్నట్లు చెప్పారు. ఆ మాజీ ఎంపీ ఇంట్లో జరిగే వేడుకలకు హాజరుకాబోమని భాత్రా సంఘం తీర్మానించింది.
గోవాలో జరిగిన ఓ ప్రైవేటు సెర్మనీలో.. సుశ్రీ సంగీతను మాజీ ఎంపీ ప్రదీప్ పెళ్లాడినట్లు భాత్రా సంఘం పేర్కొన్నది. ఇటీవల మాజీ ఎంపీకి చెందిన సోదరి సంజూ మాఝీ కూడా పెళ్లి చేసుకున్నదని, ఆమెను ఓ బ్రాహ్మణ వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశారని, దీన్ని ఖండిస్తున్నట్లు అఖిల భారతీయ ఆదివాసీ భత్రా సొసైటీ ఓ ప్రకటనలో పేర్కొన్నది. బ్రాహ్మణ కులస్థులను పెళ్లి చేసుకున్న మాఝీ కుటుంబాన్ని 12 ఏళ్ల పాటు కులం నుంచి వెలివేస్తున్నట్లు ఆ సంఘం తెలిపింది.
తమ తీర్మానంలో భాగంగా.. భాత్రా గిరిజన తెగకు చెందిన ఎవరు కూడా .. ప్రదీప్ మాఝీ ఇంట్లో జరిగే శుభకార్యాలకు వెళ్లకూడదని పేర్కొన్నారు. భాత్రా సంఘం తీసుకున్న నిర్ణయం పట్ల మాజీ ఎంపీ ప్రదీప్ మాఝీ కానీ ఆయన కుటుంబసభ్యులు కానీ స్పందించలేదు. 2009లో నబరంగ్పూర్ నియోజకవర్గం నుంచి ప్రదీప్ మాఝీ ఎంపీగా గెలిచారు. కాంగ్రెస్ పార్టీ సీటుపై ఆయన ఆ విజయం సాధించారు. అయితే గత ఏడాది ఆయన బీజూ జనతాదళ్ పార్టీలో చేరారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్రావు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
BRS Canada | కాంగ్రెస్ సర్కారు డైవర్షన్ పాలిటిక్స్ను తీవ్రంగా ఖండిస్తున్నాం : బీఆర్ఎస్ కెనడా విభాగం
Army Officer’s Wife Shared Info | చైనాతో సహా విదేశీ ఏజెంట్లకు.. కీలక సమాచారం అందించిన ఆర్మీ అధికారి భార్య
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

