దంపతుల మధ్య బలవంతపు సెక్స్ చట్టవిరుద్ధం కాదు.. ముంబై కోర్టు తీర్పు
ముంబై కోర్టు | ఇద్దరు భార్యాభర్తల మధ్య బలవంతపు శృంగారం చట్టవిరుద్ధం కాదని పేర్కొంటూ ముంబై అడిషనల్ సెషన్స్ జడ్జి సంజశ్రీ జే ఘరత్ తీర్పు ఇచ్చారు. ఇది చట్టం ముందు నిలబడదు అని ఆయన స్పష్టం చేశారు. మహారాష్ర్టకు

ముంబై : ఇద్దరు భార్యాభర్తల మధ్య బలవంతపు శృంగారం చట్టవిరుద్ధం కాదని పేర్కొంటూ ముంబై అడిషనల్ సెషన్స్ జడ్జి సంజశ్రీ జే ఘరత్ తీర్పు ఇచ్చారు. ఇది చట్టం ముందు నిలబడదు అని ఆయన స్పష్టం చేశారు. మహారాష్ర్టకు చెందిన ఓ వ్యక్తితో బాధిత మహిళకు గతేడాది నవంబర్ 22న వివాహమైంది. పెళ్లైన కొద్ది రోజులకు ఆమె భర్త, కుటుంబ సభ్యులు వరకట్న వేధింపులకు గురిచేస్తూ, ఆమెపై ఆంక్షలు విధించారు. అంతేకాకుండా వివాహమైన నెల రోజుల తర్వాత తన కోరికకు విరుద్ధంగా భర్త తనతో బలవంతంగా శృంగారం చేసినట్లు బాధిత మహిళ ఆరోపించింది.
ఈ ఏడాది జనవరి 2వ తేదీన భార్యాభర్తలిద్దరూ కలిసి మహాబలేశ్వర్కు వెళ్లారు. అక్కడ కూడా ఆమెపై బలవంతంగా సెక్స్ చేసినట్లు ఆమె పేర్కొంది. నాటి నుంచి ఆమె స్వల్ప అనారోగ్యానికి గురికావడంతో వైద్యున్ని సంప్రదించింది. డాక్టర్ ఆమెను పరీక్షించిన తర్వాత నడుము కింది భాగం పక్షవాతానికి గురైనట్లు నిర్ధారించాడు.
దీంతో తన భర్త బలవంతంగా శృంగారం చేయడంతోనే ఈ సమస్య వచ్చిపడిందని భావించిన ఆమె.. ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసు కోర్టుకు చేరడంతో.. విచారణ సందర్భంగా బాధితురాలు తన వాదనను వినిపించింది. దంపతుల మధ్య బలవంతపు శృంగారం చట్టం ముందు నిలబడదు అని జడ్జి స్పష్టం చేశారు. కానీ ఆమె పక్షవాతానికి గురవడం దురదృష్టకరం అని పేర్కొన్నారు. మొత్తానికి ఈ కేసులో బాధితురాలి భర్తకు బెయిల్ మంజూరైంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi: నా ఫోన్ ట్యాప్ చేశారు.. మోదీ చర్చకు రావాలి: రాహుల్ గాంధీ
Jangaa | త్రిగుణ్ ‘జంగా’ గ్లింప్స్ విడుదల.. రా అండ్ రస్టిక్ లుక్‌లో అదరగొట్టిన హీరో!
Gadari Kishore | బీర్ల ఐలయ్య బ్రోకర్ లెక్క మాట్లాడుతున్నడు : మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్
minister’s home attcked | మంత్రి ఇంటిపై దాడి.. ‘మేము చనిపోయాక వస్తారా?’ అంటూ పోలీసులపై ఆగ్రహం
Show cause notices | విధులకు గైర్హాజరైన హెచ్ఎం, ఆరుగురు ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

