Food Poisoning: పెళ్లి విందులో స్వీట్లు తిని 100 మందికి అస్వస్థత
Food Poisoning: పెళ్లి విందులో ఫుడ్ పాయిజన్ అయ్యింది. ఆ విందుకు హాజరైన సుమారు వంద మంది స్వీట్లు తిన్న తర్వాత అస్వస్థతకు గురయ్యారు. రాజస్థాన్‌లోని కోట్‌పుత్లి-బెహ్రోర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది.
జైపూర్: పెళ్లి విందులో ఫుడ్ పాయిజన్(Food Poisoning) అయ్యింది. ఆ విందుకు హాజరైన సుమారు వంద మంది స్వీట్లు తిన్న తర్వాత అస్వస్థతకు గురయ్యారు. రాజస్థాన్‌లోని కోట్‌పుత్లి-బెహ్రోర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. విరాట్‌నగర్ ఏరియాలో ఉన్న ధని గస్కాన్ గ్రామంలో జరిగింది. పెళ్లి విందులో పెట్టిన స్వీట్లు తిన్న తర్వాత ఆ గ్రామానికి చెందిన 105 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంట్లో చిన్నారులు కూడా ఉన్నారు. వాంతులు చేసుకున్నారు. కడుపు నొప్పితో బాధపడుతున్నారు. ఫంక్షన్ కోసం రస్మలై తయారు చేశారు. గురువారం రాత్రి ఆ స్వీట్‌ను గ్రామస్థులకు పంచారు. స్వీటు తిని అనారోగ్యానికి లోనైన వారిని అటేలేలో ఉన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో అడ్మిట్ చేశారు. తదుపరి చికిత్స కోసం వాల్లను షాపురా కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో చేర్పించారు. సరైన సమయంలో అందరికీ చికిత్స అందించినట్లు సబ్ డివిజనల్ ఆఫీసర్ కపిల్ కుమార్ ఉపాధ్యయ తెలిపారు. ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ఆహార శ్యాంపిళ్లను సేకరించింది. ల్యాబ్‌కు పంపించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

