న్యూఢిల్లీ: ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ 5-7 శాతం మంది ఉద్యోగులను తొలగించే యోచనలో ఉన్నట్లు సమాచారం. దీంతో ఈ ఏడాది మార్చి-ఏప్రిల్ నెలల్లో సుమారు 1,500 మందిపై ఈ ప్రభావం పడబోతున్నట్లు తెలుస్తున్నది. ప్రస్తుతం ఈ కంపెనీలో సుమారు 22,000 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. వీరి పనితీరును సమీక్షిస్తున్నట్లు, అదే సమయంలో అంతర్గత పునర్వ్యవస్థీకరణపై కూడా దృష్టి పెట్టినట్లు సమాచారం.