తక్కువ ఖర్చుతో విమాన ప్రయాణాలు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. బైక్ మాదిరిగా ప్యాడెడ్ సీట్లను విమానాల్లో ఏర్పాటు చేయబోతున్నారు. ప్రయాణికులు పూర్తిగా కూర్చోవడం కానీ, నిల్చోవడం కానీ చేయడానికి అవకాశం ఉండదు.
కేవలం ఓ వైపు ఆనుకుని ప్రయాణం చేయాలి. ఈ ప్రత్యేక సీట్లను స్కైరైడర్ 2.0 అని పిలుస్తున్నారు. ఈ కొత్త విధానం 2026లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.