లక్నో, అక్టోబర్ 19: ఉత్తరప్రదేశ్లో దారుణం చోటు చేసుకుంది. ఓ ఐదేండ్ల బాలికపై ఆమె ఇంట్లో అద్దెకు ఉన్నవాళ్లే లైంగిక దాడికి పాల్పడ్డారు. 6 ఏండ్లు, 13 ఏండ్లు, 16 ఏండ్ల వయస్సు కలిగిన ముగ్గురు బాలురు బాలికను ఇంటి పైకి తీసుకెళ్లి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు.
బాలియా జిల్లా కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం ఈ ఘటన చోటు చేసుకుది. నిందితులను అరెస్టు చేశామని పోలీసులు శనివారం మీడియాకు తెలిపారు. బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు బీఎన్ఎస్, పోక్సో కింద నిందితులపై కేసు నమోదు చేశారు.