న్యూఢిల్లీ, మార్చి 21: మెదడులో చిప్ సాయంతో పక్షవాత బాధితుడు వీడియో గేమ్స్, ఆన్లైన్ చెస్ ఆడారు. ఎలాన్ మస్క్‌కు చెందిన న్యూరాలింక్ కార్పొరేషన్ ఇందుకు సంబంధించిన ప్రత్యక్ష వీడియోను విడుదల చేసింది. రోగుల ఆలోచనలను కంప్యూటర్లు నియంత్రించే విషయంలో న్యూరాలింక్ చేస్తున్న ప్రయోగాల్లో దీన్ని కీలక ముందడుగుగా భావిస్తున్నారు.
పక్షవాతం లాంటి త్రీవ రోగాలతో బాధ పడేవారితో ఈ ప్రాజెక్ట్ ప్రయోగాలు చేస్తామని మస్క్ ప్రకటించారు. ఇతర పరికరాల కన్నా న్యూరాలింక్ డివైస్‌లు ఎక్కువ ఎలక్ట్రోడులను కలిగి ఉంటాయి. దీనివల్ల భవిష్యత్తులో మరిన్ని సమర్థమైన అప్లికేషన్లు తయారుచేసే అవకాశం ఉంటుంది. కంప్యూటర్‌తో ఓ వ్యక్తిని అనుసంధానించడం సంతోషకరమని విస్కాన్సిన్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్లేషనల్ న్యూరో ఇంజినీరింగ్ సహ డైరెక్టర్ కిప్ అలన్ లుడ్విగ్ తెలిపారు.