న్యూఢిల్లీ: భారత నావికా దళానికి చెందిన విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రమాధిత్యలో (INS Vikramaditya) అగ్నిప్రమాదం జరిగింది. ఐఎన్ఎస్ విక్రమాధిత్య కర్వార్లోని సముద్ర జలాల్లో విధులు నిర్వహిస్తున్నది. ఈ క్రమంలో బుధవారం రాత్రి 10.50 గంటల సమయంలో షిప్లో మంటలు చెలరేగాయి. అయితే సిబ్బంది వెంటనే మంటలను అదుపులోకి తీసుకొచ్చారని నేవీ అధికారులు ప్రకటించారు. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని, అంతా క్షేమంగా ఉన్నారని వెల్లడించారు.
#Flash
During a planned sortie for conduct of sea trials off Karwar, an incident of fire was reported onboard INS
Vikramaditya today 20 Jul 22. The fire was brought under control by the ship's crew using onboard systems. No casualties have been reported (1/2)— SpokespersonNavy (@indiannavy) July 20, 2022