Fire Breaks | ఢిల్లీలోని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కార్యాలయంలో (Home Ministry Office) అగ్నిప్రమాదం (Fire Breaks) సంభవించింది. నార్త్ బ్లాక్‌లోని ఐసీ డివిజన్ (IC Division)లోని రెండో అంతస్తులో మంగళవారం ఉదయం మంటలు చెలరేగినట్లు అధికారులు తెలిపారు. ఉదయం 9:20 గంటల సమయంలో అగ్నిప్రమాదం సంభవించినట్లు చెప్పారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ అధికారులు వెంటనే ఘటనాస్థలికి చేరుకొని ఏడు ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలను అదుపు చేసినట్లు సీనియర్ డీఎఫ్ఎస్ అధికారి ఒకరు తెలిపారు. ఈ ఘటనలో జిరాక్స్ మెషిన్, కొన్ని కంప్యూటర్లు, పత్రాలు అగ్నికి ఆహుతైనట్లు వెల్లడించారు. ప్రమాద సమయంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) భవనంలో లేరని, పలువురు సీనియర్ అదికారులు ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలూ కాలేదని తెలిపారు.
गृह मंत्रालय के नार्थ ब्लॉक के दूसरे तल पर लगी आग
आग लगने से मचा रहा हड़कंप
दमकल की गाड़ियों ने आग पर काबू पाया#FireNews #MinistryofHomeAffairs #DelhiNews #FireAccident #HomeMinistry #abcnewsmedia pic.twitter.com/nHA4X5Sxuk
— Abcnews.media (@abcnewsmedia) April 16, 2024
Also Read..
Seema Haider | సీమా హైదర్‌కు నోయిడా కోర్టు నోటీసులు
Salman Khan | కాల్పుల ఘటన.. సల్మాన్ ఇంటికెళ్లిన మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే