Fire Breaks Out | ఇంట్లో చెలరేగిన మంటలు.. ముగ్గురు చిన్నారులు సజీవ దహనం, మరో నలుగురికి గాయాలు
Fire Breaks Out | ఒక ఇంట్లో మంటలు చెలరేగాయి (Fire Breaks Out). ఈ అగ్ని ప్రమాదంలో ముగ్గురు చిన్నారులు సజీవ దహనమయ్యారు. మరో నలుగురు గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
భోపాల్: ఒక ఇంట్లో మంటలు చెలరేగాయి (Fire Breaks Out). ఈ అగ్ని ప్రమాదంలో ముగ్గురు చిన్నారులు సజీవ దహనమయ్యారు. మరో నలుగురు గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మధ్యప్రదేశ్‌లోని భింద్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. గోర్మి పోలీస్ స్టేషన్ పరిధిలోని దానేకపురా గ్రామంలో శనివారం ఉదయం ఒక ఇంట్లో మంటలు ఎగసిపడ్డాయి. ఆ మంటల్లో చిక్కుకుని ముగ్గురు చిన్నారులు కాలి చనిపోయారు. మరణించిన పిల్లలను నాలుగేళ్ల బాలుడు, పదేళ్ల బాలిక, నాలుగేళ్ల మరో బాలికగా గుర్తించారు. ఇంటి యజమాని అఖిలేష్ రాజ్‌పుత్, అతడి భార్య, కూతురు, కోడలు కూడా తీవ్రంగా గాయపడ్డారు.
కాగా, తీవ్ర కాలిన గాయాలైన వృద్ధ దంపతులను చికిత్స నిమిత్తం గ్వాలియర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. అగ్నిప్రమాదంలో చనిపోయిన పిల్లలు ఇంటి యజమాని మనుమలని చెప్పారు. గాయపడిన కుమార్తె, కోడలను గోర్మిలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు. వంట చేస్తుండగా సిలిండర్ నుంచి గ్యాస్ లీక్ కావడంతో మంటలు చెలరేగి ఉంటాయని పోలీసులు అనుమానిస్తున్నారు. అసలు కారణం ఏమిటన్న దానిపై దర్యాప్తు కోసం ఫోరెన్సిక్ బృందాన్ని రప్పించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Iran | బాలిస్టిక్ మిస్సైల్స్‌పై పరిమితిని ఎత్తేశాం.. ఇరాన్ కీలక ప్రకటన..!
Agriculture Student | మీరు ప్రొఫెసర్లా.. ప్రొఫెసర్ల ముసుగులో ఉన్న బ్రోకర్లా..? : అగ్రికల్చర్ వర్సిటీ విద్యార్థి ఫైర్.. వీడియో
Women Professor | ఒక్కొక్కరి పేర్లు బయటపెడ్తం.. వీసీ అల్డాస్ జానయ్య వేధింపులపై మహిళా ప్రొఫెసర్.. వీడియో
Running Clubs | నగరాల్లో రన్నింగ్ క్లబ్‌లకు పెరుగుతున్న ప్రాధాన్యత.. అసలేంటివి.. ఎలాంటి లాభాలను అందిస్తాయి..?
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

