కరోనాతో పోరాడండి, మోదీతో కాదు.. సోరెన్‌కు హర్ష వర్ధన్ కౌంటర్

న్యూఢిల్లీ: మన్ కీ బాత్ ప్రసంగం మాదిరిగా కాకుండా తాము చెప్పేది కూడా వినాలంటూ ప్రధాని మోదీని ట్విట్టర్లో విమర్శించిన జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌కు కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్ష వర్ధన్ ట్విట్టర్లో గట్టిగా కౌంటర్ ఇచ్చారు. కరోనా పోరుపై సీఎం దృష్టిసారించాలి గానీ ప్రధాని మోదీపై కాదని అన్నారు. “దేశ ప్రధానిపై ఒక ప్రకటన చేస్తున్నప్పుడు, కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా మహమ్మారిపై పోరాడాలన్న సంగతిని ఆయన మర్చిపోకూడదు. మీ వైఫల్యాన్ని దాచడానికి ప్రయత్నిస్తూ ప్రధాని మోడీపై ఆగ్రహం వ్యక్తం చేయడం ఖండించదగినది ” అని హిందీలో ట్వీట్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం తన ఖజానాను మూసివేసి, నిధులు ఖర్చు చేయకుండా కేంద్రమే అంతా చేయాలని హేమంత్ సోరెన్ కోరుతున్నారని హర్ష వర్థన్ ఆరోపించారు. “కరోనా వైరస్ తో పోరాడండి, ప్రధానితో కాదు” అని ఘటుగా వ్యాఖ్యానించారు.
श्री @HemantSorenJMM जी शायद अपने पद की गरिमा को भूल गए हैं।#COVID19 से उत्पन्न स्थिति को लेकर देश के PM पर कोई बयान देते समय उन्हें यह नहीं भूलना चाहिए कि इस महामारी का अंत सामूहिक प्रयासों से ही संभव है। अपनी नाकामी छिपाने के लिए अपने मन की भड़ास PM पर निकालना निंदनीय है। https://t.co/AoQbyA3u2e
— Dr Harsh Vardhan (@drharshvardhan) May 7, 2021
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

