Monkeys Fight Halts Trains | రైల్వే స్టేషన్లో కోతులు ఫైట్.. ఆగిన పలు రైళ్లు
Monkeys Fight Halts Trains | రైల్వే స్టేషన్‌లోని ప్లాట్‌ఫారమ్‌పై రెండు కోతుల మధ్య ఫైట్ జరిగింది. రబ్బరు వంటి వస్తువును ఒక కోతి విసిరేసింది. విద్యుత్ ఓవర్ హెడ్ వైర్‌ను అది తాకింది. షార్ట్ సర్క్యూట్ కావడంతో పలు రైళ్లు ఆగిపోయాయి.
పాట్నా: రైల్వే స్టేషన్‌లోని ప్లాట్‌ఫారమ్‌పై రెండు కోతుల మధ్య ఫైట్ జరిగింది. రబ్బరు వంటి వస్తువును ఒక కోతి విసిరేసింది. విద్యుత్ ఓవర్ హెడ్ వైర్‌ను అది తాకింది. షార్ట్ సర్క్యూట్ కావడంతో పలు రైళ్లు ఆగిపోయాయి. (Monkeys Fight Halts Trains) బీహార్‌లోని సమస్తిపూర్‌లో ఈ సంఘటన జరిగింది. శనివారం సమస్తిపూర్ జంక్షన్ రైల్వే స్టేషన్‌లోని ప్లాట్‌ఫారమ్ నంబర్ 4 సమీపంలో అరటిపండు కోసం రెండు కోతులు కోట్లాడుకున్నాయి. వాటిలో ఒక కోతి రబ్బరు వంటి వస్తువును మరో కోతిపైకి విసిరింది. అయితే ఆ వస్తువు ఓవర్ హెడ్ వైర్‌ను తాకడంతో షార్ట్ సర్క్యూట్ అయ్యింది. దీంతో విద్యుత్ వైరు తెగి రైలు బోగిపై పడింది. ఈ నేపథ్యంలో రైల్వే సిబ్బంది మరమ్మతులు చేశారు.
కాగా, ఈ సంఘటన వల్ల ప్లాట్‌ఫారమ్ నంబర్ 4పై నిలిచి ఉన్న సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ సుమారు 15 నిమిషాలు ఆలస్యంగా బయలుదేరింది. అలాగే పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రయాణికులు అసౌకర్యానికి గురయ్యారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Banana
- Bihar
- halts
- Monkeys Fight
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
Revanth Reddy | కరెంట్ లేదు.. ఇవ్వలేం!.. పవర్ అక్కెరపడే పనుల్ని వాయిదా వేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
Horoscope | 11-10-2026 ఆదివారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

